Begin typing your search above and press return to search.

కొత్త ట్రెండ్... ఘోస్ట్ జాబ్స్ అంటే తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా ఒక వైపు లే ఆఫ్స్ అంటూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అవిరామంగా సాగుతోంది

By:  Tupaki Desk   |   29 March 2024 3:42 AM GMT
కొత్త ట్రెండ్... ఘోస్ట్ జాబ్స్ అంటే తెలుసా?
X

ప్రపంచ వ్యాప్తంగా ఒక వైపు లే ఆఫ్స్ అంటూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అవిరామంగా సాగుతోంది. ఇంకో వైపు ఆర్టిఫిషియల్ ఇంటెల్జిన్స్ (ఏఐ) వల్ల భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు. అసలు కొన్ని డిపార్ట్ మెంటలలో ఉద్యోగుల అవసరమే ఉండదని చెబుతున్నారు. దీంతో.. జాబ్ మార్కెట్ లో పరిస్థితులు రోజు రోజుకీ కఠినతరమైపోతున్నాయి. ఈ సమయంలో జాబ్ మార్కెట్ లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అదే "ఘోస్ట్ జాబ్స్"!

అవును... ఉద్యోగులకు ఉన్న కష్టాలు చాలవన్నట్లుగా ప్రపంచ జాబ్ మార్కెట్ లోకి తాజాగా ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. దీని పేరు ఘోస్ట్ జాబ్స్. ఈ ట్రెండ్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... ఒక టెక్ కంపెనీ సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కవాలని.. సదరూ కంపెనీ హైరింగ్ కేటగిరీలో నోటిఫికేషన్ ఇస్తుంది.. ఓపెన్ ఆప్షన్ ఉంచుతుంది. దీంతో... అభ్యర్థులు తమకు కావాల్సిన జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు.

అయితే ఇలా ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకుని రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా ఇంటర్వ్యూ కాల్ మాత్రం రాదు. మరోపక్క కంపెనీ వెబ్ సైట్ లోని హైరింగ్ కేటగిరిలో మాత్రం ఉద్యోగులు కావాలనే ఓపెన్ ఆప్షన్ మాత్రం అలానే ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ నే ఫాలో అవుతున్నాయి పలు కంపెనీలు! దీన్నే ఘోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు.

థ్రెడ్ యూజర్, హెచ్.ఆర్. విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్ మార్కెట్ లోని ఈ కొత్త ట్రెండ్ గురించి షేర్ చేశారు! ఈ విషయలపై స్పందించిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్... భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం వల్ల పలు కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్ లో ఉద్యోగుల్ని నియమించుకోవడానికి ఒక కారణం అని తెలిపింది.

ఎలా తెలుసుకోవాలి?:

ఓ కంపెనీ ఉద్యోగాల కోసం ప్రకటన ఇచ్చినప్పుడు... అభ్యర్థి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యోగులు చేయాల్సిన విధులు, ఇతర జీతభత్య్యాల గురించి అస్పష్టంగా ఉంటే.. ధరఖాస్తు చేసుకున్న తరవాత వారాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటే.. ఇది ఘోస్ట్ జాబ్స్ బాపతు అని అర్ధం చేసుకోవాలి!