Begin typing your search above and press return to search.

200 సార్లు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు... అతగాడి పరిస్థితి ఇదే!

వివరాళ్లోకి వెళ్తే... జర్మనీకి చెందిన ఒక వ్యక్తి అతి జాగ్రత్తలో భాగంగానో ఏమో కానీ 217 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రకటించాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 3:30 PM GMT
200 సార్లు కోవిడ్  వ్యాక్సిన్  వేయించుకున్నాడు... అతగాడి పరిస్థితి ఇదే!
X

కొంతమందికి జాగ్రత్త ఉంటే.. మరికొంతమందికి నిర్లక్ష్యం ఉంటుంది.. అయితే ఇంకొంతమందికి మాత్రం అతిజాగ్రత్త ఉంటుంది అనుకుంటే... ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అతిజాగ్రత్త పీక్స్ అనే చెప్పాలి! అతి జాగ్రత్తకు మనోడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! కారణం... ఒక వ్యక్తి ఏకంగా 200సార్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ప్రకటించాడు. వెంటనే ఇతనిపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు స్టార్ట్ చేశారు. వారు చెప్పిన రిపోర్ట్ ఆసక్తిగా ఉంది!

అవును... యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి నుంచి వ్యాక్సిన్ లు కోట్లాదిమంది ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చి ఉండకపోతే జరిగే దారుణాలు ఊహకు అందని స్థాయిలో ఉండి ఉండేవేమో! ఈ సమయంలో ఈ వ్యాక్సిన్ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేసిన సంగతి తెలిసిందే. మరికొంతమంది అతిజాగ్రత్తలో భాగంగా ఒకటి రెండు సార్లు వ్యాక్సిన్ లు వేసుకున్నారనే మాటలూ వినిపించాయి. ఈ క్రమంలో 200కంటే ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి ఇప్పుడు తెరపైకి వచ్చాడు.

వివరాళ్లోకి వెళ్తే... జర్మనీకి చెందిన ఒక వ్యక్తి అతి జాగ్రత్తలో భాగంగానో ఏమో కానీ 217 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రకటించాడు. అయితే... అధికారిక లెక్కల ప్రకారం అతడు 134 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిసింది. ఇది కూడా పెద్ద సంఖ్యే కావడంతో శాస్త్రవేత్తల బృంధం అతడిని సంప్రదించింది. ఇందులో భాగంగా... ఎక్కువ సార్లు వ్యాక్సిన్ తీసుకోవడంలో అతడి శరీరంలోని రోగనిరోధక శక్తిలో కలిగిన మార్పులను తెలుసుకోవడానికి ఫెడ్రిక్ అలెగ్జాండర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం పరీక్షలు నిర్వహించింది.

ఈ క్రమంలో తాజాగా విడుదలైన శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... వాస్తవానికి హెచ్.ఐ.వీ, హెపటైటిస్-బి వంటి దీర్ఘకాల ఇన్ఫెక్షన్లతో బధపడేవారు రెగ్యులర్ గా వ్యాక్సిన్ లు తీసుకుంటే అవి మంటలను కలిగిస్తాయి. ఇదే సమయంలో ఇలా ఎక్కువసార్లు వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల వారి రోగ నిరోధక వ్యవస్థలోని టి-కణాలు అలసిపోతాయని.. ఫలితంగా వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిపోతుందని చెప్పిన పరిశోధనకు... అయితే ఇలా ఇన్ని సార్లు వ్యాక్సిన్ లు తీసుకున్న జర్మన్ వ్యక్తిలో మాత్రం అలాంటి సూచనలు కనిపించలేదని అన్నారు.

ఇదే సమయంలో.. ఈ వ్యక్తి శరీరంలో అన్ని సార్లు వ్యాక్సిన్ ఎక్కించినప్పటికీ... కోవిడ్ పై పోరాడే టి-కలాణ సంఖ్య తక్కలేదనే.. అవి ఎక్కువగానే ఉన్నట్లు తేలిందని.. పైగా అవి అలిసిపోయి బలహీనపడినట్లు కనిపించలేదని తెలిపారు. సాధారణంగా ఒకటి రెండు వ్యాక్సిన్ లు తీసుకున్నవారిలో మాదిరిగానే ఈ వ్యక్తిలోనూ టి-కణాలు సమర్ధంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.