Begin typing your search above and press return to search.

సార్వత్రిక ఎన్నికలు : ఈసీ కఠిన నిబంధనలు ఇవీ

ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరం అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు డెడ్ లైన్ దాటొద్దని హెచ్చరికలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   16 March 2024 12:53 PM GMT
సార్వత్రిక ఎన్నికలు : ఈసీ కఠిన నిబంధనలు ఇవీ
X

భారత దేశంలో సార్వత్రిక ఎన్నికలకు వేళయింది. ప్రపంచమంతా వీటిని ఎలా నిర్వహిస్తారనే దానిపైనే ఫోకస్ పెట్టింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడంతో ఎన్నికల నిర్వహణ ఓ సవాలే అని చెప్పొచ్చు. 2024ను ఎన్నికల సంవత్సరంగా భావిస్తున్నారు. దేశంలో తొలిసారి ఓటు వేయనున్న వారి సంఖ్య 1.85 కోట్లు అని తేలింది. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసేలా అవకాశం కల్పించనున్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం.

దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు, ఇందులో పురుషులు 49.7 కోట్లుకాగా మహిళలు 47.1 కోట్లు. ట్రాన్స్ జెండర్లు 48 వేలు, 85 సంవత్సరాలు దాటిన వారు 82 లక్షలు, 20-29 వయసు ఉన్న ఓటర్లు 19.74 కోట్లు, 18-39 మధ్య వయసు ఉన్న వారు 1.8 కోట్లు, ఈవీఎంలు 55 లక్షలు, పోలింగ్ కేంద్రాలు 10.5 లక్షలు, పోలింగ్ అధికారులు 1.5 కోట్లు.

ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపై కూడా నిబంధనలు విదించారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంటరీ స్థానాల అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులకు రూ. 75 లక్షల పరిమితి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ , ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.40 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేసుకోవచ్చు.

ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజకీయ పార్టీల ప్రచారం ముమ్మరం అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు డెడ్ లైన్ దాటొద్దని హెచ్చరికలు చేస్తోంది. కులం, మతం ఆధారంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దు. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా విమర్శలు ఉండొద్దు. తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఉండకూడదు. సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెట్టకూడదు. దివ్యాంగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. ప్రచారానికి పిల్లలను ఉపయోగించకూడదు.

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కేసులు తప్పవు. ముందే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నకిలీ వార్తలు రాసే వారిపై ఫోకస్ పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియా విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచిస్తున్నారు.