Begin typing your search above and press return to search.

అన్నీ మంచి రోజులే.. ఎమ్మెల్సీ కావలి గీష్మకు గాడ్ గిఫ్ట్

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు కావలి ప్రతిభాభారతి కుటుంబంలో అంతా మంచే జరుగుతోంది.

By:  Tupaki Desk   |   29 March 2025 4:04 PM IST
అన్నీ మంచి రోజులే.. ఎమ్మెల్సీ కావలి గీష్మకు గాడ్ గిఫ్ట్
X

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు కావలి ప్రతిభాభారతి కుటుంబంలో అంతా మంచే జరుగుతోంది. సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర రాజకీయాలతోపాటు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రతిభాభారతి కుమార్తె గీష్మ ప్రసాద్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఐదు ఎమ్మెల్సీ ఖాళీల్లో ఒకటి అనూహ్యంగా దక్కించుకున్న గీష్మ అంతకుముందు ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గానూ పదవి దక్కించుకున్నారు. పది నెలల కాలంలో రెండు పదవులు దక్కించుకున్న గీష్మ తాజా మరో అద్భుతమైన బహుమతిని అందుకున్నారు.

2018లో గీష్మ కుటుంబంలో విషాదం తర్వాత ఎట్టకేలకు ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. 2018లో గీష్మ పెద్దకుమారుడు అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత గీష్మ మరో బిడ్డకు జన్మనివ్వడంతో ఆ ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. శుక్రవారం ప్రసవించిన గీష్మ, బిడ్డతో సహా ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో బియ్యం గింజ మింగడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో గీష్మ పెద్దకుమారుడు దూరమయ్యాడు. అప్పటి నుంచి పిల్లల కోసం వేచిచూసిన గీష్మ మళ్లీ మగబిడ్డకు జన్మనిచ్చారు.

తొలి నుంచి టీడీపీలో కొనసాగుతున్న గీష్మ కుటుంబానికి ప్రస్తుతం అంతా మంచే జరుగుతోందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకురాలికి అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి పార్టీ తగిన గుర్తింపునిచ్చిందని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే గీష్మ తల్లి అయ్యారనే వార్త వారిని మరింత ఆనందానికి గురిచేసింది.