Begin typing your search above and press return to search.

ఆకలితో ఉన్న సొంత పౌరులపై హమాస్ కాల్పులు... ఐడీఎఫ్ షాకింగ్ విడియో!

గాజాలో మానవతా సాయం పంపిణీ కూడా రక్తస్తిక్తమవుతుంది. ఆహారం కోసం, అత్యవసర సరుకుల కోసం వచ్చిన పాలస్తీనియన్లపై హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెబుతూ.. దానికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 4:07 AM
Gaza Aid Turns Deadly Amid Hamas-IDF Blame Game
X

గాజాలో మానవతా సాయం పంపిణీ కూడా రక్తస్తిక్తమవుతుంది. ఆహారం కోసం, అత్యవసర సరుకుల కోసం వచ్చిన పాలస్తీనియన్లపై హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెబుతూ.. దానికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ కాల్పుల్లో హమాస్ ఉగ్రవాదులు కనీసం 31 మంది పాలస్తీనీయన్లను బలిగొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.

అవును... దక్షిణ గాజాలోని రఫాలో మానవతా సాయం పొందడానికి గుమిగూడిన ఆకలితో ఉన్న పౌరులపై హమాస్ ఉగ్రమూకలు కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడుల్లో కనీసం 31 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా.. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని వెల్లడించింది. ఈ ఘటనలో ఐడీఎఫ్ ప్రమేయం ఏమాత్రం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో పౌరులపై హమస్ కాల్పులు జరుపుతున్నట్లు చూపించే డ్రోన్ వీడియో ఫుటేజిని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) విడుదల చేశాయి. ఈ సంఘటన మానవతా ప్రయత్నాలను దెబ్బతీసే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని నొక్కి చెప్పింది. గాజాలో ఆహార పంపిణీని అడ్డుకోడానికి హమాస్ తన శక్తిమేర ప్రయత్నిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపింది.

హమాస్ నుంచి విరుద్ధ ప్రకటన!:

హమాస్ ఉగ్రమూకలపై ఇజ్రాయెల్ ఆరోపణల అనంతరం.. దానికి పూర్తి విరుద్ధమైన ప్రకటన హమాస్ నుంచి వచ్చింది. ఇందులో భగంగా... అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుగల ప్రైవేటు సహాయ సంస్థ అయిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీ.హెచ్.ఎఫ్.) నిర్వహిస్తున్న సహాయ పంపిణీ స్థలం సమీపంలో ఐడీఎఫ్ కాల్పులు జర్పిందని హమాస్ ఆరోపించింది.

ఈ కాల్పుల్లో సుమారు 200 మందికి పైగా గాయపడ్డారని.. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని, కొంతమంది మరణించగా వారి తల లేదా ఛాతిపై బుల్లెట్లు దూసుకువెళ్లాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది!