Begin typing your search above and press return to search.

తన కంపెనీల్లో స్టాఫ్ కంటే అదానీ వేతనం తక్కువ.. ఎందుకంటే..?

అయితే.. అదానీ గ్రూపులోని కోందరు ఎగ్జిక్యూటివ్ ల జీతాలు గౌతమ్ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   9 Jun 2025 8:00 AM IST
తన కంపెనీల్లో స్టాఫ్  కంటే అదానీ వేతనం తక్కువ.. ఎందుకంటే..?
X

దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానం.. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సంపన్నుల్లో 20వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో అందుకున్న వేతనం రూ.10.41 కోట్లు. ఇది.. దేశంలోని తోటి పారిశ్రామికవేత్తలే కాదు.. తన కంపెనీల్లో పనిచేస్తున్న కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ కంటే తక్కువ కావడం గమనార్హం.

అవును... భారతదేశంలోని రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ... 2023-24 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వార్షిక ఆదాయం రూ.9.26 కోట్లుగా ఉండగా.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి 12 శాతం పెరిగి రూ.10.41 కోట్లు మాత్రమే అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది! ఇది ఆయన దగ్గర పనిచేసే కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ కంటే తక్కువ.

అయితే.. ఓడరేవులు, ఇంధన రంగాల్లో విస్తరించిన తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లోనూ కేవలం రెండింటి నుంచి మాత్రమే ఆయన జీతం తీసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో అదాని ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2024-25లో రూ.2.26 కోట్లు అందుకున్న అదానీ... ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.28 లక్షలు అందుకున్నారు.

అంతక ముందు ఆర్థిక సంవత్సరంలోనూ తన ప్రధన సంస్థ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.2.46 కోట్లు తీసుకోగా.. మరో కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషనల్ ఎకనమిక్ జోన్ నుంచి రూ.1.8 కోట్ల వేతనం.. రూ.6.07 కోట్ల లాభాల్లో వాటాతో కలిపి రూ.7.87 కోట్లు అందుకున్నారు.

అయితే.. అదానీ గ్రూపులోని కోందరు ఎగ్జిక్యూటివ్ ల జీతాలు గౌతమ్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో భాగంగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సీఈఓ వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు అందుకుంటుండగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు అందుకున్నారు.

కాగా... దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండగా.. కోవిడ్ అనంతరం ఆయన తన వేతనాన్ని తీసుకోవడం లేదు. ఇక, భారతీ ఎంటర్ ప్రైజెస్ అధినేత సునీత్ మిట్టల్ 2023-24లో రూ.32.27 కోట్లు, రాజీవ్ బజాజ్ రూ.53.75 కోట్లు, పవన్ ముంజాల్ రూ.109 కోట్లు, ఎల్ & టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం రూ.76.25 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ.8062 కోట్లు వేతనాలు అదానీ కంటే అధికంగా ఉన్నాయి.