Begin typing your search above and press return to search.

భీమిలీ నుంచే పోటీచేసేందుకు గంటా సరికొత్త ప్లాన్ ఇదే!!

అవును... పొత్తులో భాగంగా తమకు 144 స్థానాలు ఉంచుకున్న చంద్రబాబు.. బీజేపీకి 10, జనసేనకు 21 స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2024 9:26 AM GMT
భీమిలీ నుంచే పోటీచేసేందుకు గంటా సరికొత్త  ప్లాన్  ఇదే!!
X

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు.. రానున్న ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంలో తీవ్ర సందిగ్ధత ఏర్పడినట్లు తెలుస్తున్న సంగతి తెలిసిందే. చీపురుపల్లి వెళ్లమని చంద్రబాబు చెబుతుంటే... విశాఖను వదిలి వెళ్లనని గంటా భీష్మించుకుని కుర్చున్నారని కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు విడుదల చేసిన మొదటి రెండు విడతల అభ్యర్థుల జాబితాలోనూ గంటా శ్రీనివాసరావు పేరు కనిపించలేదు!

దీంతో... గంటా విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనే విషయం ఆసక్తి నెలకొనగా... భీమిలీ నుంచి పోటీ చేసే విషయంలో గంటా శ్రీనివాస రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది మరింత ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చీపురుపల్లి వెళ్లకూడదని.. రానున్న ఎన్నికల్లో భీమిలీ నుంచే పోటీచేయాలనే విషయంలో గంటా సరికొత్త ప్లాన్ వేశారని అంటున్నారు.

అవును... పొత్తులో భాగంగా తమకు 144 స్థానాలు ఉంచుకున్న చంద్రబాబు.. బీజేపీకి 10, జనసేనకు 21 స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ గా ఉన్న విశాఖ ఉత్తరం సీటును బీజేపీకి కేటాయించగా.. ఆయన కోరుతున్న భీమిలీ సీటును జనసేనకు కేటాయించారని తెలుస్తుంది. పరిస్థితి ఇలా ఉన్నా కూడా తాను చీపురుపల్లి వెళ్లనని చెబుతున్నారు గంటా. దానికి కారణం బొత్సతో ఉన్న వ్యాపార సంబంధాలే కారణం అనే వాదనా వినిపిస్తుంది!

ఈ సమయంలో తన భవిష్యత్ కార్యచరణపై తన అనుచరులతో సమావేశమైన గంటా శ్రీనివాస్... భీమిలీ నుంచి పోటీ విషయంలో గట్టిగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో తనను పార్టీ నుంచి బయటకు పంపించే ఉద్దేశ్యంతోనే తనకు భీమిలీ టిక్కెట్ నిరాకరిస్తున్నారనే కామెంట్ కూడా చేశారని తెలుస్తుంది. ఈ సమయంలో వారు తీసేసేకంటే ముందే తానే తప్పుకుంటే బెటర్ అనే ఆలోచన గంటా చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా టీడీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరి, తద్వారా భీమిలీ టిక్కెట్ పొందాలనే సరికొత్త ప్లాన్ గంటా చేశారని అంటున్నారు. పైగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న గంటాకు పవన్ తొ మాంచి బాండింగే ఉందని.. అది ఇలా ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నారు. భీమిలీలో పోటీచేయాలనే తన కోరిక నెరవేరడానికి ఈ సమయంలో ఇంతకుమించిన మార్గం మరొకటి లేదని గంటా భావిస్తున్నారని తెలుస్తుంది.

మరి ఈ ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం... జనసేన టిక్కెట్లు దక్కించుకున్న వలసనేతల జాబితాలో గంటాకూడా చేరినట్లవుతుంది!!