గంటాకు ఉందిలే మంచి కాలం !
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉగాది తరువాత అన్నీ మంచి రోజులేనా అన్న చర్చ సాగుతోంది.
By: Satya P | 10 March 2026 9:00 AM ISTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉగాది తరువాత అన్నీ మంచి రోజులేనా అన్న చర్చ సాగుతోంది. ఆ మాటకు వస్తే ఇపుడు ఉన్నవి మంచి రోజులు కాదా అంటే ఆయనకు ఎపుడూ కీలక స్థానమే పార్టీలో ప్రజలలో ఉంది. భీమునిపట్నం నుంచి 2024 ఎన్నికల్లో 90 వేలకు పైగా భారీ మెజారిటీని సాధించిన గంటాకు ఈసారి కూటమి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. చూస్తూండగానే రెండేళ్ళు గడచిపోతున్నాయి. దాంతో గంటాకు ఈ టెర్మ్ మంత్రి పదవి ఉందా లేదా అన్న చర్చ ఆయన అనుచరులు అభిమానులలో పెద్ద ఎత్తున ఉంది.
దూసుకుపోతున్న వైనం :
విశాఖ జిల్లాలో ఇపుడు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నవి గంటా నియోజకవర్గం భీమిలీలోనే. ఐటీ పరిశ్రమలు వచ్చినా గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, ఎయిర్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ సిటీ వచ్చినా అనేక ఇతర పరిశ్రమలు వచ్చినా అన్నీ భీమిలీ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయి. దాంతో గంటా కూడా జోరు చేస్తున్నారు. ఆయన గతానికి భిన్నంగా ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన భూముల సేకరణ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు భూసేకరణకు అవరోధాలు లేకుండా అందరినీ మెప్పించి ఒప్పించి ఈ ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూస్తున్నారు. దాంతో చంద్రబాబు దృష్టిలో గంటాకు మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు.
చినబాబుతో సైతం :
ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గంటా తన నియోజకవర్గం సమస్యల మీద ప్రస్తావించి హైలెట్ అయ్యారు. అంతే కాదు ఆయన చినబాబు లోకేష్ తో కూడా కలసి మెలసి ముందుకు సాగుతున్నారు. ఏపీలో టాప్ త్రీ భారీ మెజారిటీ ర్యాంకర్లు అంటూ పల్లా శ్రీనివాస్ గంటాలతో కలసి లోకేష్ ఫోటోలు దిగడం కూడా గంటా పట్ల హైకమాండ్ కి ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ అర్ధం అవుతోంది అని అంటున్నారు. తన నియోజకవర్గంలో కూడా ప్రతీ రోజూ గంటా పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. ప్రజలతో ఎక్కడికక్కడ మమేకం అవుతున్నారు. నియోజకవర్గాన్ని ఆయన కంచుకోటగా మారుస్తున్నారు.
ప్లస్ పాయింట్స్ ఇవేనా :
ఇక గంటాకు మంత్రి పదవి దక్కుతుంది అని ప్రచారంలో ఉంది. గంటా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఏపీలో వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అన్నది తెలిసిందే. దాంతో పాటుగా ఆయన రాజకీయంగా కూడా చురుకైన వారు. విశాఖ జిల్లా వరకూ వస్తే మంత్రి పదవి అయితే ఖాళీగా ఉంది. దాంతో విస్తరణలో గంటాకు చాన్స్ దక్కవచ్చు అని అంటున్నారు. విశాఖ జిల్లా కూటమికి చాలా కీలకమైనదిగా ఉంది. ఈ నేపథ్యంలో అనుభవం కలిగిన వారు కనుక మంత్రిగా ఉంటే విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా రాజకీయం కూడా కూటమికి ప్రత్యేకించి తెలుగుదేశానికి అనుకూలిస్తుంది అని అంటున్నారు.
సెంటిమెంట్ పరంగా చూస్తే :
వైసీపీని కూడా బలపడకుండా నియంత్రించేందుకు గంటా వంటి అనుభవం కలిగిన వారు కలసి వస్తారు అని అంటున్నారు. ఇక సెంటిమెంట్ పరంగా చూస్తే కనుక గంటా ఇవే తనకు చివరి ఎన్నికలు అని అంటున్నారు. దాంతో గౌరవప్రదంగా మంత్రి హోదాలో పదవీ విరమణ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్ని అంటున్నారు. దాంతో దాంతో గంటాకు మంత్రి పదవి ఖాయం అయింది అని అంటున్నారు.
