Begin typing your search above and press return to search.

అమేధీ రాయబరేలీ : గాంధీ కుటుంబం వీడ్కోలు...!?

ఆయన 1952, 1957లలో జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పార్లమెంట్ కి వచ్చారు. ఆయన ఇందిరాగాంధీ భర్త

By:  Tupaki Desk   |   24 March 2024 3:26 AM GMT
అమేధీ రాయబరేలీ :  గాంధీ కుటుంబం వీడ్కోలు...!?
X

అమేధీ సీటు అంటే గాంధీ కుటుంబం గుర్తుకు వస్తుంది. అలాగే రాయబరేలీ సీటు కూడా. ఈ రెండు సీట్లూ దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల సొంత సీట్లుగా చలామణీలో ఉంటున్నాయి. ఈ రెండు సీట్లలో రాయబరేలీని చూస్తే మొదట ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆయన 1952, 1957లలో జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పార్లమెంట్ కి వచ్చారు. ఆయన ఇందిరాగాంధీ భర్త.

ఆయన తరువాత ఆ సీటుని ఇందిరాగాంధీ తీసుకుని 1967, 1971 అలాగే 1980లలో పోటీ చేసి గెలిచారు. మొత్తం పదేళ్ళ పాటు ఇందిరాగాంధీ రాయబరేలీ నుంచి ఎంపీగా ఉన్నారు. 1980లో ఆమె రాయబరేలీ నుంచి గెలిచినా రాజీనామా చేసి రెండవ సీటు అయిన మెదక్ ని ఉంచుకున్నారు. ఇక అదే రాయబరేలీ సీటులో 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయారు కూడా.

ఇక 1980లో ఇందిరాగాంధీ వదిలేసిన సీటులో అరుణ్ నెహ్రూ పోటీ చేసి గెలిచారు. ఆయన తరువాత షీలా కౌల్, రాయబరేలీ నుంచి కాంగ్రెస్ ఎంపీ అయ్యారు. 1996 నుంచి అశోక్ సింగ్, సతీష్ శర్మ బీజేపీ ఎంపీలుగా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా గాంధీ బాధ్యతలు తీసుకున్నాక 1999లో అమేధీ నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో ఆ సీటు తన కుమారుడు రాహుల్ గాంధీకు అప్పగించి ఆమె రాయబరేలీకి మారారు. అలా 2004 నుంచి 2024 వరకూ రెండు దశాబ్దాల పాటు సోనియా ఇదే సీటు నుంచి ఎంపీగా ఉంటూ వస్తున్నారు.

ఆమె తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ సీటు నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారు అని ప్రచారంలో ఉంది. ఇక అమేధీ విషయం తీసుకుంటే 1980లో సంజయ్ గాంధీ తొలిసారిగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎంపీ అయ్యారు. అయితే ఆయన నెగ్గిన కొద్ది కాలంలోనే మరణించారు. ఆ తరువాత రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991 దాకా అంటే పదేళ్ళ కాలం అమేధీ నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1984 నుంచి 1989 దాకా దేశానికి ప్రధానిగా కూడా చేశారు.

ఆ తరువాత బీజేపీ ఎంపీలు గెలిచారు. 1999 నుంచి కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ఇక్కడ స్థానం తిరిగి సంపాదించారు. అలా 2004లో రాహుల్ గాంధీ తొలిసారి గెలిచారు. 2009, 2014లలో కూడా గెలిచి హ్యాట్రిక్ ఎంపీ అయ్యారు. 2019లో ఆయన అమేధీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తే అమేధీలో ఓటమి పాలు అయ్యారు.

ఆయనకు బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక వయనాడ్ లో రాహుల్ గాంధీకు ఏకంగా నాలుగు లక్షల 31 వేల బ్రహ్మాండమైన మెజారిటీ దక్కింది. దాంతో రాహుల్ మరోసారి వయనాడ్ నుంచి పోటీ పడుతున్నారు. ఆయన అమేధీ నుంచి పోటీ చేయరని అంటున్నారు.

అదే విధంగా చూస్తే సోనియా గాంధీ వదిలేసిన రాయబరేలీని కూడా ప్రియాంకా గాంధీ వదిలేస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని ప్రచారం మీదనే దృష్టి పెడతారని అంటున్నారు. అలా కాంగ్రెస్ అగ్ర నేతలు గాంధీ కుటుంబం వారసులు దశాబ్దాలుగా గెలిచిన అమేధీ రాయబరేలీ రెండు సీట్లూ కూడా వదిలేయడం గడచిన పాతికేళ్ళలో ఇదే మొదటిసారి అని అంటున్నారు.

అయితే ప్రియాంకా గాంధీని రాయబరేలీ నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి. కానీ యూపీ అంతా బీజేపీ గాలి వీస్తోందని రామమందిరం నిర్మాణంతో హిందూత్వ నినాదం సెంటిమెంట్ గా మారిందని అంటున్నారు. మొత్తం 80 సీట్లలో బీజేపీ తొంబై అయిదు శాతం పైగా గెలుచుకుంటుందని అంటున్నారు. తమ సీట్లలో ఓడిపోతామనే గాంధీ వారసులు పోటీకి దూరంగా ఉంటున్నారు అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.