Begin typing your search above and press return to search.

పవిత్ర గంగా జలానికి ఇంత జీఎస్టీ విధించారా మోడీజీ?

తాజాగా ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణ చేశారు. పవిత్ర గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధించినట్లుగా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు పవిత్రంగా భావించే గంగా జలంపై జీఎస్టీ విదిస్తారా?

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:06 AM GMT
పవిత్ర గంగా జలానికి ఇంత జీఎస్టీ విధించారా మోడీజీ?
X

ఏమైనా సరే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కసిగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా దేనికైనా సిద్దమన్నట్లుగా ఆ పార్టీ అడుగులు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తున్న నేపథ్యంలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. మోడీ సర్కారుపై ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని మాటల్ని ట్విస్టు చేస్తూ.. అందరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఆరోపణతో అందరి చూపు తన మీద పడేలా చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. తాజాగా ఆయన మాట్లాడుతూ సంచలన ఆరోపణ చేశారు. పవిత్ర గంగాజలంపై 18 శాతం జీఎస్టీ విధించినట్లుగా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు పవిత్రంగా భావించే గంగా జలంపై జీఎస్టీ విదిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ప్రజాధనం దోపిడీకి.. ప్రభుత్వం వ్యవహరించే దుర్మార్గానికి ఇదో నిదర్శనంగా ఆయన వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఆయన.. పవిత్ర గంగాజలంపై మీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించినట్లుగా పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగాలు దొరక్క.. స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపే యువత సంఖ్య గత ఐదేళ్లలో 5 శాతం నుంచి 57 శాతానికి చేరినట్లుగా మండిపడ్డారు.

2014 వరకు ఎంతో పారదర్శకంగా నడిచిన సమాచార మక్కు చట్టం 18 ఏళ్లు పూర్తి చేసుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోడీహయాంలో సమాచార హక్కును నీరు కార్చినట్లుగా మండిపడ్డారు. సమాచార హక్కు కమిషనర్లుగా ప్రధానమంత్రిమోడీ పక్షాన బాకా ఊదేవాళ్లనే నియమిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఖర్గే చేసిన గంగా జలంపై జీఎస్టీ విధింపు అంశంపై జీఎస్టీ స్పందించింది.

కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా పవిత్ర గంగాజలంపై ఎలాంటి పన్ను విధించింది లేదని.. పరోక్ష పన్నుు.. ఎగుమతి దిగుమతి సుంకాల కేంద్ర బోర్డు స్పందిస్తూ.. పూజా సామాగ్రిపై జీఎస్టీ విధించాలన్న చర్చ మాత్రమే జీఎస్టీ కౌన్సిల్ లో జరిగిందని.. కానీ ఆ అంశాన్ని పక్కన పెట్టేసి మినహాయింపులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఖర్గే చేసిన ట్వీట్ లో పవిత్ర గంగాజలంపై జీఎస్టీ అన్న మాటలో ఎలాంటి నిజం లేదంటున్నారు. మరి.. ఖర్గే ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేసినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.