Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి ఆ బిగ్ నేత.. కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ!

తాజాగా ఆయన, ఆయన సతీమణి (ఆమె కూడా మాజీ ఎంపీ).. కుమారుడు.. మరో మాజీ ఎంపీ సంజయ్ కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకోవటానికి సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 4:20 AM GMT
కాంగ్రెస్ లోకి ఆ బిగ్ నేత.. కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ!
X

కలలు కనొచ్చు. కానీ.. సాధ్యాసాధ్యాల్ని సరి చూసుకోవాలి. అందునా.. వరుస ఎదురుదెబ్బలు ఎన్నో తిన్న తర్వాత అధికారం చేతికి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా మసులుకోవాలి. అరుదైన అవకాశం అంది వచ్చినప్పుడు ప్రజల మనసుల్ని దోచుకోవాలి. ఉట్టికి ఎగరినంతనే ఆకాశానికి ఎగురుతామన్న అత్యాశ పనికి రాదు. అంచనాల్ని మరిచి.. తనకు మించిన తోపు లేదన్నట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్.

ప్రాంతీయ పార్టీగా పటిష్టమైన స్థితిలో ఉన్న టీఆర్ఎస్ ను దేశాన్ని ఏలాలన్న కోరికతో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా మార్చేసిన కేసీఆర్.. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిని హైదరాబాద్ కు పిలిచి.. పార్టీ కండువా కప్పటం తెలిసిందే. అలా కప్పినోళ్లలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్. మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి.. తన పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు. అన్ని బాగున్నప్పుడు.. అంతా బాగానే నడుస్తుంది. కాస్త తేడా వస్తే మొత్తానికే తేడా వచ్చేస్తుంది.

ఇప్పుడు అలాంటి అనుభవమే మిగిలింది. కాంగ్రెస్ ఎంపీగా తొమ్మిదిసార్లు ఎంపికైన ఆయన.. బీఆర్ఎస్ నేతగా ఉండటం తెలిసిందే. తాజాగా ఆయన, ఆయన సతీమణి (ఆమె కూడా మాజీ ఎంపీ).. కుమారుడు.. మరో మాజీ ఎంపీ సంజయ్ కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకోవటానికి సిద్ధమయ్యారు. దీంతో.. ఒడిశా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి. తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరి వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించినట్లుగా ప్రకటించి.. వాటి మీద ఫోకస్ చేసి.. అధికారం చేతికి ఇచ్చిన తెలంగాణను లైట్ తీసుకున్న కేసీఆర్ కు.. తాజా పరిణామాలు తెలియజేయాల్సిన వాస్తవాల్ని తెలియజేసే అవకాశం ఉందని చెప్పాలి. బీఆర్ఎస్ లో చేరటానికి ముందు బీజేపీలో చేరిన ఆయన్ను.. గులాబీ కారులోకి ఎక్కించిన కేసీఆర్ శ్రమంతా.. ఏడాది కూడా కాకముందే బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్ లో ఉన్న ఆయనకు.. తాజా ఎదురుదెబ్బ మరింత బలంగా తగిలినట్లుగా చెప్పకతప్పదు.