గల్లా మాధవి @ చంద్రబాబుపై స్కై రేంజ్ అభిమానం...!
ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్లు ఇవ్వాలని.. ఆ పార్టీ లేవనెత్తుతున్న అంశాలపై ధీటుగా స్పందించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
By: Garuda Media | 2 Feb 2026 5:15 PM ISTగుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్న గళ్లా మాధవి.. తాజాగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు ఉన్న అనంత అభిమానం చాటుకున్నారు. పార్టీ తరఫున ఏ చిన్న వచ్చినా.. ఎలాంటి సమస్య ఎదరైనా నేనున్నానంటూ.. కొందరు నాయకులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్లు ఇవ్వాలని.. ఆ పార్టీ లేవనెత్తుతున్న అంశాలపై ధీటుగా స్పందించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
అయితే.. కొందరు నాయకులు వింటున్నారు. మరికొందరు నాయకులు తెరమీదికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఓ మహిళా ఎమ్మెల్యేగా రెచ్చిపోయారు. చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఉద్యమించారు. తెలుగు మహిళల విభాగం కార్యకర్తలను వెంటబెట్టుకుని అంబటి రాంబాబు కార్యాలయాన్ని ముట్టడించారు. అంతేకాదు.. అంబటికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఒక్క గల్లా మాధవే కాదు.. ఆమె భర్త రామచంద్రరావు కూడా.. ఈ నిరసనలో తన వంతు పాత్ర పోషించారు. అంబటి కార్యాలయాన్ని చుట్టుముట్టారు. బేషరతుగా అంబటి సీఎం చంద్రబాబుకు.. క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కార్యకర్తలను కూడా మాధవి ముందుండి నడిపించారు. కష్టకాలంలో టీడీపీ ఎలా స్పందిస్తుంది ? కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారు ? అనే విషయాలను ఆమె స్పష్టం చేశారు. దీంతో గుంటూరులో పెద్ద ఎత్తున టీడీపీ ఏకతాటిపైకి వచ్చింది.
ఈ పరిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దావాలనంలా వ్యాపించాయి. పెద్ద ఎత్తున చంద్రబాబుకు మద్దతుగా కార్యకర్తలు రోడ్డెక్కారు. గతంలో కూడా చంద్రబాబుపై కేసునమోదై.. ఆయన జైలుకు వెళ్లినప్పుడు.. హుటాహుటిన ఇంత పెద్ద స్పందన రాకపోవడం గమనార్హం. రెండు రోజుల తర్వాత కానీ.. పార్టీ కార్యకర్తలు స్పందించలేకపోయారు. కానీ, తాజాగా మాత్రం ఎమ్మెల్యే గల్లా మాధవి చొరవ తీసుకుని అడుగులు వేయడం.. పార్టీ కార్యకర్తలతో కలిసి ఉద్యమించడం ద్వారా.. పార్టీ విషయంలో ఆమెకు ఉన్న నిబద్ధత, బాబుపై ఉన్న అభిమానాన్ని చాటిందని అంటున్నారు పరిశీలకులు.
