Begin typing your search above and press return to search.

జైలు జనార్ధనరెడ్డి...నో స్పెషల్ అంటూ షాక్

అయితే కోర్టు ఆయన పిటిషన్ ని కొట్టిపారేసింది. అంతే కాదు శిక్ష పడిన నేరస్థులకు ప్రత్యేక కేటరిగి ఏదీ ఉండదని స్పష్టంగా చెప్పింది.

By:  Tupaki Desk   |   15 May 2025 11:14 PM IST
జైలు జనార్ధనరెడ్డి...నో స్పెషల్ అంటూ షాక్
X

గాలి జనార్ధనరెడ్డి కాదు జైలు జనార్ధనరెడ్డి గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఓబులాపురం మైనింగ్ కేసులో ఏకంగా ఏడేళ్ల జైలు శిక్షతో ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఖైదీగా ఉంటున్నారు. అయితే మంత్రిగా చేసిన వారు భారీ పారిశ్రామికవేత్త, బంగారం స్పూన్ తో అన్నీ తినే వారు. బంగారు సింహాసనం ఆయనకు ఉందని బాత్ రూం లో సైతం బంగారంతో అన్నీ అమర్చుకునే అపర కుబేరుడు అన్న పేరు తెచ్చుకున్న వారు. అలాంటి గాలి జనార్ధన్ రెడ్డిని ఒక సాధారణ ఖైదీ మాదిరిగా జైలులో ఒక గదిలో ఉంచితే ఎలా.

మరి ఆయనకు కూడా ఇది చాలా బాధేసినట్లుగా ఉంది. అందుకే ఆయన తనకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కలిగించాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ ని కొట్టిపారేసింది. అంతే కాదు శిక్ష పడిన నేరస్థులకు ప్రత్యేక కేటరిగి ఏదీ ఉండదని స్పష్టంగా చెప్పింది. అక్రమాల కేసులో అరెస్టయిన వారికి స్పెషల్ కేటగిరీ కింద వసతులు కల్పించలేమని సీబీఐ కోర్టు అభిప్రాయపడింది. అలా గాలి జనార్థన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది.

దాంతో పాపం గాలి జనార్ధనరెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన నిందితునిగా జైలు జీవితం గడిపినపుడు కొన్ని సదుపాయాలు ఉండేవి. ఇపుడు విచారణ పూర్తి అయి శిక్ష ఖరారు అయింది. దాంతో ఆయన ఇతర ఖైదీల మాదిరిగానే ఉండాల్సి వస్తోంది. మరి అది నచ్చని మనసు కూడా ఇచ్చగించని జనార్ధనరెడ్డి ఆశ చావక కోర్టు దాకా వెళ్ళారు.

అయితే ఒక్కసారి శిక్ష పడిన తరువాత జైలులో ఎవరైనా ఒకటే. నో స్పెషాలిటీస్ అని అంటున్నారు. అంటే ఇక మీదట గాలి జీవితం అంతా జైలు జీవితమే కానుంది. అంతే కాదు సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన ఉండాలా అంటే అంతే అనుకోవాలి. ఏది ఏమైనా రాతలు తారు మారు అయితే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు కాలం ప్రతికూలమై కాటేస్తే ఇంతే అనుభవించాల్సిందే అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆయన గాలి జనార్ధనరెడ్డి కాదు జైలు జనార్ధనరెడ్డి అంటూ ట్రోల్ చేస్తున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత ఇదేనేమో.