Begin typing your search above and press return to search.

తెలంగాణకు కాబోయే మంత్రులు వీరే!

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 7తేదీ ఉదయం పది గంటల సమయంలోముఖ్యమంత్రితో పాటు... పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:31 AM GMT
తెలంగాణకు కాబోయే మంత్రులు వీరే!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కసరత్తు జరుగుతున్న వేళ.. తమకు సీఎం కుర్చీ అవకాశం ఇవ్వాలన్న పేరుతో ఉత్తమ్.. భట్టి విక్రమార్క ఇద్దరు తాజాగా ఢిల్లీకివెళ్లటం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. మరోవైపు మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న దానిపై ఇప్పటికే ఒక జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 7తేదీ ఉదయం పది గంటల సమయంలోముఖ్యమంత్రితో పాటు... పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. విశ్వసనీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మంత్రివర్గం జాబితాను సిద్ధం చేశారని.. అందులో అన్ని వర్గాలకు చెందిన వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సామాజిక సమతూకం మిస్ కాకుండా ఉండేలా ప్లాన్ చేశారని చెబుతున్నారు.

ఇంతకూ మంత్రుల జాబితాలో ఉన్న వారెవరు? వారి సామాజిక వర్గం ఏమిటన్నది చూస్తే..

ముఖ్యమంత్రి.. రేవంత్ రెడ్డి (రెడ్డి)

డిప్యూటీ సీఎం.. భట్టి విక్రమార్క (ఎస్సీ)

స్పీకర్.. పొన్నం ప్రభాకర్ (బీసీ)


మంత్రులు..

తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ)

పొంగులేటి శ్రీనివాసరెడ్డి (రెడ్డి)

కోమటిరెడ్డి వెంకటరెడ్డి (రెడ్డి)

ఉత్తమ్ కుమార్ రెడ్డి (రెడ్డి)

సీతక్క (ఎస్టీ)

శ్రీధర్ బాబు (బ్రాహ్మణ)

జూపల్లి క్రిష్ణారావు /ప్రేమ్ సాగర్ రావు (వెలమ)

గడ్డం వినోద్ (ఎస్సీ)

జీవన్ రెడ్డి (రెడ్డి)

కొండా సురేశ (బీసీ)

షబ్బీర్ అలీ/ ఫిరోజ్ ఖాన్ (మైనార్టీ)