Begin typing your search above and press return to search.

పురందేశ్వరి ఆస్తులు, అప్పుల వివరాలివే!

అవును... నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వడంతో అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 April 2024 10:52 AM GMT
పురందేశ్వరి ఆస్తులు, అప్పుల వివరాలివే!
X

ఎన్నికల వేళ లోక్‌ సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలతో పాటు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, విద్యార్హతలతో పాటు పోలీసు కేసులకు సంబంధించిన వివరాలు అందజేస్తున్నారు.

అవును... నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వడంతో అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థులు ప్రకటిస్తున్న ఆస్తులు, వారిపై ఉన్న కేసులు, వారికున్నట్లు చెబుతున్న అప్పులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ సమయలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్ సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు!

ఈ సందర్భంగా అఫిడవిట్ లో ఆమె పొందుపరిచిన ఆస్తుల వివరాలు... తనతో పాటు తన భర్త వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.61.46 కోట్లు అని ఆమె వెల్లడించారు. వీటిలో చరాస్తులు రూ.11.75 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.49.70 కోట్లుగా వెల్లడించారు. ఇదే క్రమంలో... వారికున్న అప్పులు రూ.6.73 కోట్లు అని తెలిపారు.

ఇదే క్రమంలో... 1.6 కిలోల బంగారం, 74 క్యారెట్ల వజ్రాలు, 10 గ్రాముల ముత్యాలు ఉండగా.. వీటి విలువ రూ.1.19 కోట్లని తెలిపిన పురందేశ్వరి... తన పేరిట వ్యవసాయ భూమి కానీ, ఎటువంటి వాహనం కానీ లేవని చెప్పడం గమనార్హం! ఇదే క్రమంలో... హైదరాబాద్‌ బంజారా హిల్స్‌ లోని ఇంటి విలువ రూ.5.55 కోట్లు అని తెలిపిన పురందేశ్వరి... తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు!