Begin typing your search above and press return to search.

జగన్ కి ఫ్రై డే టెన్షన్...?

జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఏకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 1:15 AM GMT
జగన్ కి ఫ్రై డే టెన్షన్...?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఈ శుక్రవారం టెన్షన్ తప్పదా. అంటే వివరాలు చూస్తే అలాగే ఉన్నాయని అంటున్నారు. జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఏకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు.

జగన్ కేసుల విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోందని పేర్కొంటూ ఆయన సుప్రీం కోర్టు తలుపు తట్టారు. జగన్ కేసుల విచారణ ఎన్ని సార్లు వాయిదా పడడంతో ఆయన లెక్కలతో సహా సుప్రీం కోర్టుకు ఫైల్ చేసిన పిటిషన్ లో చెప్పారు. ఏకంగా సీబీఐ కోర్టు జగన్‌పై కేసులను మూడు వేల 71 సార్లు వాయిదా వేసిందన్న రఘురామ క్రిష్ణం రాజు దీని మీద అత్యున్నత న్యాయం స్థానాన్ని ఆశ్రయించారు.

జగన్ కేసుల విషయంలో తెలంగాణా సీబీఐ కోర్టులో జాప్యం జరుతోందని, అందువల్ల ఈ కేసులు సత్వరం విచారణకు నోచుకోవాలంటే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన వినతి చేస్తున్నారు. ఇక జగన్ తాను ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాకుండా సీబీఐ కోర్టు నుంచి మినహాయింపు పొందారని రఘురామ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. అంతే కాదు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా జగన్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.

అసలు కేసుల విచారణలో జాప్యానికి ఈ డిశ్చార్జ్ పిటిషన్లే కారణం అని కూడా రఘురామ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే జగన్ మీద రఘురామ పెట్టిన పిటిషన్ని జస్టిస్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం ఈ శుక్రవారం విచారణ జరపనుంది.

ఈ కేసులో ఏమి తేలనుందో అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. జగన్ కేసుల విషయంలో విచారణ జాప్యం మీద సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం మీద ఆసక్తి కూడా నెలకొని ఉంది. పిటిషనర్ రఘురామ కోరినట్లుగా వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది కూడా చర్చగా ఉంది.

ఏది ఏమైనా సుప్రీం కోర్టులో జగన్ మీద కేస్దు ఫైల్ చేయడం ద్వారా తాను ఎప్పటికీ జగన్ కి రెబెల్ నే అని రఘురామ మరోమారు రుజువు చేసుకున్నారు. ఆయన ఈ విధంగా చేయడం ద్వారా ఈసారి వచ్చే ఫ్రైడేను జగన్ కి టెన్షన్ పుట్టించేలా చేశారా అన్న మాట వినిపిస్తోంది.

గత కొద్ది కాలంగా ఫ్రైడే అంటే చంద్రబాబు విషయంలోనే ఉత్కంఠ ఉంటూ వచ్చింది. బాబు కేసులే ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఉంటూ వచ్చాయి. ఎట్టకేలకు బాబు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. బాబు బయటకు వచ్చిన మరుసటి రోజే రఘురామ ఇలా రియాక్ట్ కావడం అంటే పాలిట్రిక్స్ అంటే ఇదే కదా అని అంటున్న వారూ ఉన్నారు.