Begin typing your search above and press return to search.

మందుబాబుల గుండె పిండేసే వార్త... మనసెలా వచ్చింది?

అవును... ఏకంగా కొన్ని వేల లీటర్ల వైన్ ను కొని మరీ నాశనం చేయడానికి సిద్దపడింది ఫ్రాన్స్ ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:53 AM GMT
మందుబాబుల గుండె పిండేసే వార్త... మనసెలా వచ్చింది?
X

సాధారణంగా మందు బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ప్రతీ బొట్టునీ ఎంతో జాగ్రత్తగా చూస్తుంటారు. “బొట్టు బొట్టు లో మత్తు” అన్నట్లుగా విలువిస్తారు. అలాంటిది కొన్ని వేల లీటర్ల మద్యాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే..? అప్పుడు మందుబాబుల పరిస్థితి ఏమిటి..? ప్రస్తుతం ప్రాన్స్ లోని మందుబాబుల పరిస్థితి అలానే ఉంది!

అవును... ఏకంగా కొన్ని వేల లీటర్ల వైన్ ను కొని మరీ నాశనం చేయడానికి సిద్దపడింది ఫ్రాన్స్ ప్రభుత్వం. సాధారణంగా వినియోగానికి మించి ఉత్పత్తి ఉంటే.. స్టాకు బాగా పేరుకుపోయి ఉంటే.. తక్కువ ధరకు అమ్మి సరుకు క్లియర్ చేసుకుంటారు. కానీ... కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ఎక్కువ నిల్వ ఉన్న వైన్ ను నాశనం చేయాలని నిర్ణయించుకుంది.

ఫ్రాన్స్ ప్రభుత్వం ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది.. అసలు ఆ అవసరం ఏమి వచ్చింది వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం! రష్యా - ఉక్రెయిన్‌ సంక్షోభం, ద్రవ్యోల్బణం, కొవిడ్ ప్రభావం, ఆహారం, ఇంధన ధరలు పెరిగిపోవడంతో.. ఫ్రాన్స్ ప్రజలు తమ ఖర్చులను గణనీయంగా తగ్గించుకుంటున్నారంట.

ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైన్ వంటివాటికోసం మనీ వేస్ట్ చేయాలని అనుకోవడం లేదంట. పైగా మందు కోసమే కాకుండా.. దాని తర్వతా వచ్చే అనారోగ్య సమస్యలకు డబ్బు వృధా అవుతుందని భావిస్తున్నారంట. దీంతో ఫ్రాన్స్ లో మద్యం నిల్వలు బాగా పేరుకుపోయాయంట.

దీంతో... వైన్‌ దిగ్గజాలైన బోర్డాక్స్‌, లాంగ్యూడాక్‌ సంస్థల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. వాటి వద్ద నిల్వలు భారీగ మొత్తంలో పేరుకుపోయాయి. దీంతో భారీగా నష్టపోయిన ఆ సంస్థలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. అందులో భాగంగా ఆ వైన్ నిల్వలను కొనుగోలు చేయాలని భావించింది.

అలా అని ప్రభుత్వమే వైన్ కొని దాన్ని కాస్త తక్కువ ధరకు అందిస్తుందని అనుకుంటే పొరపాటే. వైన్ డిమాండ్ ను పెంచడం కోసం కొన్న మొత్తాన్ని నాశనం చేయాలని డిసైడయ్యింది. దీని కోసం ఏకంగా 200 మిలియన్ల యూరోలను ఖర్చు చేస్తోంది. అంటే... . దాదాపు 1700 కోట్ల రూపాయలు అన్నమాట!

ఈ స్థాయిలో ఖర్చు మందుబాబుల గుండెలను పిండేస్తుంటే... మరోపక్క ఫ్రాన్స్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది. రేషన్ షాపుల ద్వారా అయినా తక్కువ ధరకు ప్రజలకూ అందించకుండా మరీ ఇదేమి శాడిజం అనే కామెంట్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం!