Begin typing your search above and press return to search.

`ఫ్రీ ఫైర్‌` గేమ్ ఆడ‌లేద‌ని.. ప్రియుడి ఘాతుకం ఏం చేశాడంటే!

ఫ్రీ ఫైర్ గేమ్‌. ఇది మొబైల్‌లో ఆడుకునే ఆట‌. యువ‌తీ యువ‌కులు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా ఆడుతు న్న ఆట‌కూడా ఇదే. దీనిలో త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారితో ఆన్‌లైన్ ద్వారా ఆడుకోవ‌చ్చు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 9:45 AM GMT
`ఫ్రీ ఫైర్‌` గేమ్ ఆడ‌లేద‌ని.. ప్రియుడి ఘాతుకం ఏం చేశాడంటే!
X

ఫ్రీ ఫైర్ గేమ్‌. ఇది మొబైల్‌లో ఆడుకునే ఆట‌. యువ‌తీ యువ‌కులు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా ఆడుతు న్న ఆట‌కూడా ఇదే. దీనిలో త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న వారితో ఆన్‌లైన్ ద్వారా ఆడుకోవ‌చ్చు. ఇలా.. ఓ యువ‌తి, ఓ యువ‌కుడు ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప‌రిచ‌యం అయ్యారు. చాన్నాళ్లు ఈ గేమ్‌ను ఆడుకున్నారు. ఇలా అయిన ప‌రిచ‌యం.. ప్రేమ‌కు దారితీసింది. ఆన్‌లైన్‌లోనే ముద్దు ముచ్చ‌ట్లు తీర్చుకున్నారు.

అంతేకాదు.. ఆన్‌లైన్‌లోనే న‌గ్న ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేసుకున్నారు. ఇక‌, వ‌చ్చే ఏడాది ఇరు వురు క‌లుసుని.. త‌మ ప్రేమ‌ను పెళ్లి వ‌ర‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ.. ఇంత‌లోనే స‌ద‌రు యువ‌తికి ఫ్రీ ఫైర్ గేమ్ బోరు కొట్టింది. దీంతో ఆడ‌డం మానేసింది. దీనిని ఇటువైపు యువ‌కుడు.. త‌న‌ను ప్రేమించ‌డం మానేసింద‌ని భావించి.. ఆమె న‌గ్న చిత్రాలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టేశాడు.

మ‌హారాష్ట్ర‌లోని పుణేకు చెందిన యువ‌కుడు అమ‌న్‌.. బాంబే కు చెందిన యువ‌తితో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో ప్రేమ చిగురించి.. చివ‌ర‌కు ఆమె న‌గ్న చిత్రాలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో పెట్టేవ‌ర‌కు వెళ్లింది. దీనిపై యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అమ‌న్ ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో పోలీసులు ఉన్నారు.

ఏంటీ ఫ్రీ ఫైర్‌?

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే యాప్ ఇది. 2017లో దీనిని సృష్టించారు. దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఆడుకునే వెసులు బాటు ఉంది. దీనిని ప్రారంభించిన నాటి నుంచి కోట్ల మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిని 1110 డాట్ స్టూడియో సృష్టించింది.