Begin typing your search above and press return to search.

ఉచిత బస్సు భారం అన్ని కోట్లా ?

అదేదో రెగ్యులర్ గా టికెట్ల జారీచేసినపుడు ఓఆర్ పెరిగుంటే బాగుండేది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 6:56 AM GMT
ఉచిత బస్సు భారం అన్ని కోట్లా ?
X

ఉచిత బస్సు ప్రయాణం భారం రు. 250 కోట్లని లెక్కతేలింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సులో ప్రయాణించే పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఉచితం అనగానే మహిళల్లో ఎక్కువమంది అవసరం ఉన్నా లేకపోయినా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరగటం చాలా సంతోషించాల్సిన విషయమే. అదేదో రెగ్యులర్ గా టికెట్ల జారీచేసినపుడు ఓఆర్ పెరిగుంటే బాగుండేది. కానీ ఉచిత ప్రయాణం అనేటప్పటికి ఓఆర్ అపరిమితంగా పెరిగిపోయింది.

పెరిగిన ఓఆర్ కారణంగా ఏమైందంటే ప్రభుత్వంపైన భారం పెరిగిపోయింది. ప్రతినెలా ఉచిత ప్రయాణ భారం ప్రభుత్వంపై రు. 250 కోట్లుగా లెక్కతేలింది. అంటే ప్రభుత్వం నుండి ప్రతినెలా రు. 250 కోట్లు రీఎంబర్స్ మెంట్ రూపంలో ఆర్టీసీకి అందాలని లెక్కకట్టారు. ఇదే విషయమై ఒక సమీక్షలో ఆర్టీసీకి 250 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి ఫైనాన్స్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతినెలా ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలని చెప్పారు.

మహిళల ఉచిత ప్రయాణ భారాన్నే కాకుండా విద్యార్ధుల పాస్ భారం, వికలాంగుల ప్రయాణ కన్సెషన్ భారం తదితరాలను కూడా ప్రతినెలా ఆర్టీసీకి చెల్లించాలని రేవంత్ ఆదేశించారు. నిజానికి ఇలాంటి రీఎంబర్స్ మెంట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుండి అందటంలేదు. ప్రభుత్వం చెల్లించాల్సిన రీ ఎంబర్స్ మెంట్లు చెల్లించని కారణంగానే బకాయిలు పేరుకుపోయి చివరకు ఆర్టీసీ నష్టాల్లో పడిపోయింది. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా రీ ఎంబర్స్ మెంట్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

కేసీయార్ పదేళ్ళ పాలనలో ఆర్టీసీకి ఇలాగే జరిగింది. అందుకనే నష్టాలు బాగా పెరిగిపోయాయి. వీటన్నింటినీ సమీక్షించిన రేవంత్ ఇక నుండి ఆర్టీసీకి చెల్లించాల్సిన రీ ఎంబర్స్ మెంట్లన్నీ ఎప్పటికప్పుడు అంటే ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నిజానికి రీ ఎంబర్స్ మెంట్లన్నవి ముఖ్యమంత్రి ఇష్టప్రకారం జరుగుతాయే కానీ ఉన్నతాధికారుల విచక్షణ ఆధారంగా జరగవు. మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణ భారం నెలకు 250 కోట్లని లెక్కతేలింది.