Begin typing your search above and press return to search.

గొప్ప ప‌ద‌విలో 'గే'.. ప్ర‌పంచంలోనే తొలిసారి

అదికూడా ఆర్థికంగా బ‌లంగా ఉన్న‌, అభివృద్ధిలో దూసుకుపోతున్న ఫ్రాన్స్‌కు 'గే' తొలిసారి ప్ర‌ధాని అయ్యారు. ఆయ‌నే ప్ర‌స్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న గాబ్రియెట్ అట్ట‌ల్‌.

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:43 AM GMT
గొప్ప ప‌ద‌విలో గే.. ప్ర‌పంచంలోనే తొలిసారి
X

గే.. స్వ‌లింగ సంప‌ర్కులు. అయితే.. ఇటీవ‌ల కాలంలో వీరు రాజ‌కీయంగా గుర్తింపు పొందుతున్నారు. అంతేకాదు.. న్యాయ‌స్థానా ల్లోనూ కీల‌క పోస్టులు ద‌క్కించుకుంటున్నారు. అయితే.. ప్ర‌పంచంలోనే తొలిసారి ఒక దేశానికి ప్ర‌ధాని కావ‌డం ఇప్పుడే జ‌రిగింది. అదికూడా ఆర్థికంగా బ‌లంగా ఉన్న‌, అభివృద్ధిలో దూసుకుపోతున్న ఫ్రాన్స్‌కు 'గే' తొలిసారి ప్ర‌ధాని అయ్యారు. ఆయ‌నే ప్ర‌స్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న గాబ్రియెట్ అట్ట‌ల్‌. ఈయ‌న‌ను ప్ర‌ధానిగా నియ‌మిస్తూ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏం జ‌రిగింది?

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధానిగా ఉన్న ఎలిజ‌బెత్ బోర్న్ ఇటీవ‌ల వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. నూత‌నంగా రూపొందించిన ఇమ్మిగ్రేష‌న్‌(వ‌ల‌స‌లు) చ‌ట్టంలో క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు చేర్చారు. ఇత‌ర దేశాల పౌరుల‌ను నిర్బంధించ‌డంతోపాటు.. వ‌ల‌స‌ల‌ను ఇక‌పై క‌ఠినంగా నిరోధించాల‌ని పేర్కొన్నారు. అయితే.. దీనిపై చ‌ట్ట‌స‌భ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కూడా మిన్నంటాయి. ఈ చ‌ట్టం అమ‌లైతే.. దేశం ఆర్థికంగా న‌ష్ట‌పోతుంద‌ని, ప‌ర్యాట‌క రంగంపైనా ప్ర‌భావం ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెట్టాయి. కొత్త చట్టం ప్రకారం.. విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి.

అయితే.. ఈ చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకునేందుకు ప్ర‌ధాని బోర్న్ అంగీక‌రించ‌లేదు. "నా ప‌ద‌వికి రాజీనామా అయినా.. చేస్తా. కానీ, చ‌ట్టాన్ని మాత్రం వెన‌క్కి తీసుకోను" అని శ‌ప‌థం చేశారు. ఆమె శ‌ప‌థం చేసిన‌ట్టుగానే చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోకుండా.. నిర‌స‌న ల వేడి కార‌ణంగా ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన స‌భ్యుల ఓటింగ్‌లో 34. స్వలింగ సంపర్కుడు.. గాబ్రియెల్‌ అట్టల్ ను ప్రధానిగా ఎన్నుకొన్నారు. ఈ పదవికి ఎంపికైన అతి పిన్నవయస్కుడు, పైగా ప్ర‌పంచంలోనే ప్ర‌ధాని అయిన గే ఈయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం.