Begin typing your search above and press return to search.

రెండో భార్య కేసులో మాజీ సీఎంకు బిగ్ రిలీఫ్.. కోర్టు చెప్పిందేమంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కమ్ జేడీఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధినేతగా వ్యవహరిస్తున్న హెచ్ డీ కుమార స్వామికి ఒక గుడ్ న్యూస్ అందింది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 6:43 AM GMT
రెండో భార్య కేసులో మాజీ సీఎంకు బిగ్ రిలీఫ్.. కోర్టు చెప్పిందేమంటే?
X

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కమ్ జేడీఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధినేతగా వ్యవహరిస్తున్న హెచ్ డీ కుమార స్వామికి ఒక గుడ్ న్యూస్ అందింది. ఆయనపై ఉన్న ఒక ఇబ్బందికర కేసును కోర్టు కొట్టేయటం ఆయనకు బిగ్ రిలీఫ్ గా చెప్పాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలుచేసిన నామినేషన్ తో పాటు తన వివరాలకు సంబంధించిన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు నమోదు చేశారంటూ ఒక ఫిర్యాదు నమోదైంది.

కుమారస్వామి తన రెండో భార్య వివరాలు.. ఆమె పిల్లల సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చలేదని.. ఆయన రెండో భార్య కుటుంబం గురించి ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వలేదంటూ ఆనంద్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఈ కేసును విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టేసింది. మొదటి భార్య జీవించి ఉన్నంత కాలం రెండో పెళ్లి చేసుకోవటానికి అవకాశం లేదని తీర్పును ఇచ్చింది. అదే సమయంలో ఎన్నికల లేఖలో పిల్లల సమాచారం ఇవ్వాలన్న రూల్ కూడా లేదని కోర్టు స్పష్టంచేసింది. అందుకే ఈ కేసులో కుమారస్వామి ప్రజాప్రతినిధుల చట్టంలోని 125 ఏ సెక్షన్ ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

అదే సమయంలో ఆనంద్ ఫిర్యాదునుకొట్టేస్తూ తన నిర్ణయాన్ని వెలువరించింది. తాజాగా వెలువడిన ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు మాజీ సీఎం కుమారస్వామికి ఊరట కలిగించేలా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు కుమారస్వామికి ఇబ్బందికరంగా మారిందన్న ప్రచారం జరిగిన కేసు నుంచి ఆయన బయటపడిపోవటం బిగ్ రిలీఫ్ గా మారిందంటున్నారు.