Begin typing your search above and press return to search.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే జనసేనలోకి...?

కానీ బీజేపీ నుంచి ఒక్క రాజు గారు మాత్రమే అటెండ్ అయ్యారు. ఆ మాటకు వస్తే పవన్ ఎన్నిసార్లు విశాఖ వచ్చినా పొత్తు పార్టీగా బీజేపీ నేతలు ఎపుడూ ఆయన్ని కలిసినది లేదు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:42 AM GMT
బీజేపీ మాజీ ఎమ్మెల్యే జనసేనలోకి...?
X

విశాఖ జిల్లాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు రాజకీయం అర్ధం కావడంలేదు అని సొంత పార్టీ నేతలే అంటారు. ఆయన తనదైన శైలిలో తెలుగుదేశం నేతలను కలుస్తారు. చంద్రబాబుని పొగుడుతారు. అలాగే టీడీపీ వారితో రాసుకుని పూసుకుని తిరుగుతారు.

టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని తన అభిప్రాయాన్ని మీడియా ముందు అనేక సార్లు చెప్పి వివాదాల్లోకి వెళ్ళిన రాజు గారు సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్న టైం లో షోకాజ్ నోటీసుని అందుకున్నారు.

ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో మరోమారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని రాజు గారికి బలమైన కోరిక ఉంది. 2014లో లక్కీగా ఆయనకు విశాఖ ఉత్తరం టికెట్ దక్కింది. జనసేన టీడీపీ మద్దతుతో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇక పొత్తులు లేకపోవడం వల్ల ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఈసారి మాత్రం పొత్తులు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక వేళ పొత్తులు లేకపోతే మాత్రం ఫిరాయించి అయినా ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉంది. అలాగే బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంది.

దాంతో ఎన్నికల వేళకు పొత్తు మూడు పార్టీల మధ్య ఉంటుందని రాజు గారు నమ్ముతున్నారు. ఒక వేళ కాకుంటే జనసేనలోకి వెళ్తారు అని కూడా టాక్ నడుస్తోంది. విశాఖకు తాజాగా వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజు గారు ఒక హొటల్ లో టీడీపీ వారితో పాటుగా కలిసారు.

పవన్ కళ్యాణ్ తో మాటా మంతీ చేసారు. బీజేపీ నుంచి ఏ ఒక్క నాయకుడూ కూడా ఆయనతో రాకపోవడం విశేషం. నిజానికి టీడీపీ వారు పవన్ని కలవాలని పెట్టుకున్న ప్రొగ్రాం అది. కానీ బీజేపీ నుంచి ఒక్క రాజు గారు మాత్రమే అటెండ్ అయ్యారు. ఆ మాటకు వస్తే పవన్ ఎన్నిసార్లు విశాఖ వచ్చినా పొత్తు పార్టీగా బీజేపీ నేతలు ఎపుడూ ఆయన్ని కలిసినది లేదు.

పవన్ కూడా తన పార్టీ వారితోనే మీటింగ్స్ చూసుకునేవారు. కానీ ఫస్ట్ టైం టీడీపీ వారు పవన్ని కలవాలని గాఢంగా అనుకుని మరీ కలసి వచ్చారు. రాజకీయ ముచ్చట్లు కూడా జరిపారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తుల తరువాత పొలిటికల్ కో ఆర్డినేషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి తమ్ముళ్ళు కలవడాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా బీజేపీ మాజీ ఎమ్మెల్యే తానుగా వెళ్ళి కలవడం మాత్రం రాజకీయంగా చర్చకు తావిస్తోంది.

బీజేపీ కనుక పొత్తులకు ఓకే చెప్పకపోతే మాత్రం రాజు గారు జనసేనలోకి వెళ్ళి అయినా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే విశాఖ ఉత్తరంలో జనసేనకు మహిళా నేత ఒకరు ఉన్నారు. ఆమె 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఈసారి మహిళా కోటాలో ఆమె టికెట్ ని ఆశిస్తున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా భీమిలీ సీటు దక్కకపోతే ఉత్తరం నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు.

అపుడు పొత్తులలో భాగంగా ఆ సీటు టీడీపీకి వెళ్తుంది అని అంటున్నారు. మరి మధ్యలో రాజు గారు పార్టీ మారినా సీటు దక్కుతుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా రాజు గారి రాజకీయం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదని అంటున్నారు.