Begin typing your search above and press return to search.

గ్రీన్‌కార్డు కోసం... బారులే బారులు.. 2024 వ‌ర‌కు ఫుల్‌!

దీనికి సంబంధించి గోక‌రే ఇమ్మిగ్రేష‌న్ లా సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు మంజునాథ్ గోక‌రే మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో గ్రీన్ కార్డు పొంద‌డం అంత సుల‌భం అయ్యే ప‌నికాద‌ని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   25 Oct 2023 6:41 AM GMT
గ్రీన్‌కార్డు కోసం... బారులే బారులు.. 2024 వ‌ర‌కు ఫుల్‌!
X

అగ్ర‌రాజ్యం అమెరికాలో స్థిర‌ప‌డాల‌నుకునే.. ఉద్యోగులు త‌ర‌చుగా గ్రీన్ కార్డు కోసం ప్ర‌య‌త్నం చేస్తుంటా రు. ముఖ్యంగా 2, 3 కేట‌గిరీల ఉద్యోగులు.. అమెరికాలో స్థిర నివాసం ఏర్ప‌రుచుకునేలా గ్రీన్ కార్డ్ పొందు తున్నారు. ఇప్పుడు ఇలాంటివారి తాకిడి భారీగా పెరిగిపోయింది. ఎంత‌లా అంటే.. గ్రీన్ కార్డు కోసం.. బారులు తీరేలా! అంతేకాదు.. 2024 ఆర్థిక సంవ‌త్స‌రంలో అస‌లు అప్లికేష‌న్లు కూడా తీసుకోలేనంత‌గా గ్రీన్ కార్డు వ్య‌వ‌హారం మారిపోయింది.

ప్ర‌స్తుతం అనేక వేల‌ మంది భార‌తీయులు గ్రీన్ కార్డు కోసం.. క్యూలో ఉన్నారంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రీన్ కార్డు కోసం వెయిటింగులో ఉన్న వారి సంఖ్య అక్ష‌రాలా 10 ల‌క్ష‌ల‌, 10 వేల మంది.(1.1 మిలియ‌న్‌). వీరంతా కూడా ఈబీ(ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్‌)-2, లేదా ఈబీ-3 కేట‌గిరీకి చెందిన వారే. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఈబీ-2, ఈబీ-3 ఉద్యోగుల‌కు గ్రీన్ కార్డు లు ఇవ్వ‌డం త‌ల‌కు మించిన భారంగా మారింది. అమెరికా పౌర‌స‌త్వ‌, వ‌ల‌స‌ల విభాగం(సీఐఎస్‌) పేర్కొంది. అంతేకాదు, 2024 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌రకు వేలాది ద‌ర‌ఖాస్తులు పెండింగులో ఉన్నాయ‌ని తెలిపింది.

దీనికి సంబంధించి గోక‌రే ఇమ్మిగ్రేష‌న్ లా సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు మంజునాథ్ గోక‌రే మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో గ్రీన్ కార్డు పొంద‌డం అంత సుల‌భం అయ్యే ప‌నికాద‌ని వ్యాఖ్యానించారు. తాజాగా కొన్ని నిబంధ‌న‌లు కూడా మార్చిన‌ట్టు వివ‌రించారు. అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో చివరి దశ.. విదేశీ పౌరులకు చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ స్థితిని సర్దుబాటు చేయడానికి ఫారమ్ I-485ని దాఖలు చేయడం.

EB-2 మరియు EB-3 రెండూ ఉపాధి ఆధారిత వర్గాలు. EB-2 కోసం, స్థానానికి తప్పనిసరిగా అధునాతన డిగ్రీ అవసరం లేదా అంతర్జాతీయ ఉద్యోగి శాస్త్రాలు, కళలు లేదా వ్యాపారంలో అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. EB-3కి అర్హత సాధించడానికి కనీసం బ్యాచిలర్ డిగ్రీ అవసరం.

యుఎస్ కాంగ్రెస్ జోక్యం చేసుకుని, సరఫరా, డిమాండ్ మధ్య ఈ అసమతుల్యతకు పరిష్కారం కనుక్కోక పోతే, భారతీయులకు గ్రీన్ కార్డ్ పొంద‌డం మ‌రింత క‌ష్ట‌మ‌వుతుంద‌ని గోకరే పేర్కొన్నారు. "స్పష్టంగా, ఉపాధి ఆధారిత వర్గాలకు ఎక్కువ వీసాలు అవసరం - ప్రస్తుతం సంవత్సరానికి ఉన్న గ్రీన్ కార్డుల ప‌రిమాణం 1,40,000 అమెరికా ఆర్థిక వ్యవస్థకు సరిపోదు. ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించకపోతే ఇతర ప్రదేశాలకు త‌ర‌లి వెళ్లిపోతారు. అని గోక‌రే వ్యాఖ్‌యానించారు.