Begin typing your search above and press return to search.

వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బ్రేక్... వీడియోతో క్లారిటీ ఇచ్చిన అధికారులు!

ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యే అంటూ రకరకాల పోస్టులు నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. దీంతో... దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:33 AM GMT
వైజాగ్  ఫ్లోటింగ్  బ్రిడ్జ్  బ్రేక్... వీడియోతో క్లారిటీ ఇచ్చిన అధికారులు!
X

అదిగో తోక అంటే.. ఇదిగో పులు అనే రోజులు ఇవి! దానికి కారణం... సోషల్ మీడియా ఆ స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడమే! ఏది వాస్తవమో.. ఏది అవాస్తవమో తెలుసుకునే లోపు... విషయం ఊరంతా చుట్టి వచ్చేస్తుంటుంది. తాజాగా వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జి బ్రేక్ అయిన విషయం కూడా ఆ కోవలోకే వస్తుందంటూ.. వీడియో విడుదల చేశారు అధికారులు. ఇందులో భాగంగా వీడియో ఫుటేజ్ ని, టైం స్టాంప్ ని విడుదల చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం సుమారు 100 మీటర్ల పొడవుతో అలలపై తేలియాడే వంతెనను ఏర్పాటు చేసింది. దీనివల్ల సందర్శకులు సముద్రంలోకి 100 మీటర్ల మేర వెళ్లేలా చేస్తుంది. ఈ వంతెన అలలను తట్టుకుంటూ.. సందర్శకులను సురక్షితంగా ఉంచుతుంది! అయితే... తాజాగా ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే బ్రేక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఒక ఇష్యూ వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేలియాడే వంతెన ప్రారంభించబడిన రోజే కూలిపోయింది.. ఒడ్డు నుంచి జనం చూస్తుండగానే ముక్కలైపోయింది.. అదృష్టవశాత్తు ఈ ఘటన సమయంలో ఆ వంతెనపై ఎవరూ లేరు.. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యే అంటూ రకరకాల పోస్టులు నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. దీంతో... దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

దీంతో అధికారులు లైన్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇరిగిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు! ఇందులో భాగంగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పరిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ చెక్ ప్రక్రియలో భాగంగా బ్రిడ్జ్ నుంచి ఫ్లాంట్ ఫాం ను డీ లింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తే.. ఇలా బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో రాధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఈ సమయంలో దానికి సంబంధించి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన డీలింక్ చేస్తున్న దృశ్యాలను.. అప్పటి టైం వివరాలను విడుదల చేశారు. అనంతరం ఈ విషయాలపై స్పందించిన జిల్లా కలెక్టర్, విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్... మాక్ డ్రిల్ లో భాగంగా ఈ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకే బ్రిడ్జ్ నుంచి ఫ్లాట్ ఫాం ను విడదీసి పరిశీలించినట్లు చెప్పారు. విషయం తెలుసుకోకుండా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో వాతావరణంలోని మార్పుల వల్లే సోమవారం ఈ బ్రిడ్జ్ పైకి సందర్శకులను అనుమతించలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా... ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో కాస్త ఎక్కువగా ఉండే ఆటుపోట్ల సమయంలో.. సాంకేతిక పరిశీలనలో భాగంగా చేపట్టే రెగ్యులర్ ప్రొసీజర్ మాత్రమే ఇది అని.. ఇది రెగ్యులర్ గా జరుగుతుందని అన్నారు.