Begin typing your search above and press return to search.

అయోధ్యకు తొలి ఫ్టైట్ ఎప్పుడు? షెడ్యూల్ ఏంటి?

అయోధ్య అన్నంతనే శ్రీరాముడి జన్మస్థలి అన్న విషయం తెలిసిందే. అక్కడి రామజన్మభూమిలో నిర్మిస్తున్న రాముడి మందిరాన్ని భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:36 AM GMT
అయోధ్యకు తొలి ఫ్టైట్ ఎప్పుడు? షెడ్యూల్ ఏంటి?
X

అయోధ్య అన్నంతనే శ్రీరాముడి జన్మస్థలి అన్న విషయం తెలిసిందే. అక్కడి రామజన్మభూమిలో నిర్మిస్తున్న రాముడి మందిరాన్ని భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని వచ్చే ఏడాది జనవరి 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆలయ ప్రారంభం కోసంయావత్ దేశం కళ్లు కట్టుకొని ఎదురుచూస్తోంది.

అయితే.. జనవరి 22న ప్రధాని మోడీ వెళ్లి ఓపెన్ చేస్తున్న అయోధ్య రామాలయానికి ముందుగా.. ఢిల్లీ నుంచి ఫ్లైట్లు వెళ్లనున్నాయి. అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించటానికి ముందే.. అయోద్య ఎయిర్ పోర్టుకు విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. డిసెంబరు 30న మొదటి విమానాన్ని అయోధ్యలో నిర్మించిన కొత్త ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయబోతున్నారు.

అయోధ్యలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి.. ‘‘మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం’’గా పిలవనున్నారు. ఈ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. అంతకు ముందే అంటే.. డిసెంబరు 30నే విమాన సర్వీసుల్ని టెస్టు ట్రయల్ కోసం వినియోగించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఇండిగో తన విమానాల్ని రోజువారీగా నడపనుంది. ఢిల్లీ నుంచి ఉదయం 11.55 గంటలకు బయలుదేరి మధ్యామ్నం 1.15 గంటలకు అయోధ్యకు చేరనుంది.

అదే విమానం తిరిగి 1.45 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వేళకు ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. రోజువారీగా ఇదే షెడ్యూల్ ను ఫాలో అవుతారని చెబుతున్నారు. ఇక.. అహ్మదాబాద్ నుంచి మంగళవారం.. గురువారం.. శనివారాల్లో మాత్రమే ఫ్లైట్లు అయోధ్యకు చేరుకోనున్నాయి. అహ్మదాబాద్ లో ఉదయం 9.10 గంటలకు బయలుదేరి విమానం అయోధ్యకు 11 గంటలకు చేరుకోనుంది. ఆ తర్వాత అరగంటల వ్యవధిలో తిరిగి ఆ విమానం అయోధ్య నుంచి అహ్మదాబాద్ కు వెళ్లనుంది. అహ్మదాబాద్ కు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకుంటుందని చెబుతున్నారు. అయోధ్య శ్రీరాముడ్ని విమానంలో అలా వెళ్లి.. దర్శించుకునే రోజు దగ్గర్లోనే ఉందన్నమాట.