Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్లను బెజవాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

సోమవారం ఉదయం విపరీతమైన పొగమంచు హైదరాబాద్ ను కమ్మేసింది. దీంతో.. హైదరాబాద్ కు రావాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి

By:  Tupaki Desk   |   25 Dec 2023 10:03 AM GMT
హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్లను బెజవాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ రోజు (సోమవారం) ఉదయం వివిధ ప్రాంతాలనుంచి హైదరాబాద్ కు రావాల్సిన పలు విమానాలు.. అత్యవసరంగా విజయవాడకు తరలించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? జరిగిందన్నది హాట్ టాపిక్ గా మారింది. పండుగ తెల్లవారుజామున ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకున్న పలువురికి షాకులు తగిలిన పరిస్థితి. ఇంతకూ ఎందుకిలా జరిగింది? అసలేమైంది? అన్న వివరాల్లోకి వెళితే..

సోమవారం ఉదయం విపరీతమైన పొగమంచు హైదరాబాద్ ను కమ్మేసింది. దీంతో.. హైదరాబాద్ కు రావాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించని వైనంతో అప్పటికప్పుడు పలు విమానాల్ని విజయవాడకు అత్యవసరంగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్.. గోవా.. తిరువనంతపురం నుంచి హైదరాబాద్ కు రావాల్సిన మూడు విమానాల్ని బెజవాడకు తరలించారు.

విమాన యాన సంస్థల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో విమానంలో 150 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైన మంచు దుప్పటి మాదిరి కప్పేయటంతో.. విమానాల్ని సరైన రీతిలో ల్యాండ్ కాలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. ఉన్నతాధికారుల సూచన మేరకు ఢిల్లీకి ఈ మూడు విమానాల్ని తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరుదుగా మాత్రమే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబ

ఇదిలాఉండగా.. ఉదయం 7.35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సిన ఒమాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ను బెంగళూరుకు తరలించారు. ఉదయం 8.05 గంటలకు రియాద్ నుంచి రావాల్సిన విమానంతో పాటు.. ఉదయం 9.10 గంటలకు జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. ఇవే కాకుండా మరికొన్ని విమానాల్ని బెంగళూరు.. నాగపూర్ లకు మళ్లించారు. సాధారణంగా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే విమానాలు.. గంట వ్యవధిలోనే తిరిగి బయలుదేరతాయన్న సంగతి తెలిసిందే.

దీంతో.. అలా వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు శంషాబాద్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అలాంటి వాటిల్లో కొచ్చికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ రద్దు కావటంతో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో.. షెడ్యూల్ మార్చి.. కొన్ని గంటల తర్వాత ఫ్లైట్ ఉంటుందని చెప్పిన సిబ్బంది.. కాసేపటికి మళ్లీ మాట మార్చటంతో అయ్యప్పలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకుంటే.. ఈ ప్రయాణికులందరికి సోమవారం రాత్రి 10.40గంటల వేళలో శబరిమలలో దర్శనం ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పొగమంచు.. కొన్ని వందల మంది ప్రయాణికుల షెడ్యూల్ మొత్తాన్ని కకావికలం చేసిందని చెప్పాలి.