Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో పబ్ వద్ద ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి!

అవును... ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఒక పబ్‌ లోని బీర్ గార్డెన్‌ లోకి ఒక వృద్ధుడు నడుపుతున్న కారు దూసుకువచ్చింది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 8:25 AM GMT
ఆస్ట్రేలియాలో పబ్  వద్ద ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి!
X

ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. విక్టోరియా రాష్ట్రంలోని ఒక పబ్‌ లోని బీర్ గార్డెన్‌ లోకి ఒక కారు దూసుకురావడంతో భారీ ప్రమాధం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు సభ్యులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కాస్త బాగానే ఉందని అంటున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

అవును... ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఒక పబ్‌ లోని బీర్ గార్డెన్‌ లోకి ఒక వృద్ధుడు నడుపుతున్న కారు దూసుకువచ్చింది. దీంతో... ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు భారతీయులు మరణించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాధంలో మృతి చెందిన భారతీయుల వివరాలు ఇలా ఉన్నాయి. వివేక్ భాటియా (38), అతని కుమారుడు విహాన్ (11).. ప్రతిభా శర్మ (44), ఆమె భాగస్వామి జతిన్ చుగ్ (30), ఆమె కుమార్తె అన్వి (9) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో భాటియా భార్య రుచి (36), చిన్న కుమారుడు అబీర్ (6), 11 నెలల చిన్నారితో సహా మరో ఐదుగురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదంపై విక్టోరియా పోలీస్ చీఫ్ కమీషనర్ షేన్ పాటన్ స్పం దించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతు... బాధితులందరూ ఈ ప్రాంతానికి సందర్శకులేనని తెలిపారు. మౌంట్ మాసిడోన్‌ కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి వైట్ బీ.ఎం.డబ్ల్యూ ఈ ప్రమాదానికి కారకుడని తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అతను మద్యం సేవించి లేడని నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.

ఇదే సమయంలో అతను కూడా తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. ప్రాణానికేమీ ప్రమాదం లేదని తెలిపారు. ఇదే సమయంలో ఈ ప్రమాధంలో పాయింట్ కుక్‌ కి చెందిన ప్రతిభా శర్మ, ఆమె భాగస్వామి జతిన్ చుగ్ అక్కడికక్కడే మరణించారని ఆస్ట్రేలియన్ సిక్కు సపోర్ట్ గ్రూప్ సెక్రటరీ గుర్జిత్ సింగ్ ధృవీకరించారు!

ఇక ఆమె కుమార్తె అన్వి (9)ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని వెల్లడించారు. ఈ సందర్భంగా... కోవిడ్ సమయంలో ప్రతిభా శర్మ తమ గ్రూప్‌ లో వాలంటీర్‌ గా చేరారని, క్వారంటైన్‌ లో ఉన్న ప్రజలకు ఆహారం, కిరాణా సామాగ్రిని అందించడంలో సహాయపడారని సింగ్ చెప్పారు. ఇదే సమయంలో ఆమె విక్టోరియన్ పార్లమెంటు, స్థానిక కౌన్సిల్‌ కు కూడా పోటీ చేసిందని తెలిపారు.

మరోపక్క విరిగిన కాళ్లు, అంతర్గత గాయాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ రాయల్ మెల్‌ బోర్న్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో కోలుకుంటున్న రుచి, ఆమె కొడుకు అబీర్ ను చూడటానికి వివేక్ భాటియా తల్లిదండ్రులు భారతదేశం నుండి విక్టోరియాకు వెళ్తున్నారని తెలుస్తుంది.

ఈ దారుణ ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఎక్స్ లో స్పందించారు. ఇందులో భాగంగా... డేల్స్‌ ఫోర్డ్‌ లో జరిగిన దానికి తామంతా దిగ్భ్రాంతి చెందామని, చాలా బాధపడ్డామని అన్నారు. వారి జీవితాలు చాలా క్రూరంగా ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవడం దారుణం అని తెలిపారు. కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు విక్టోరియన్ రోడ్లపై మరణించినవారి సంఖ్య 204కి చేరింది!