విన్నంతనే ఉలికిపాటు గ్యారెంటీ.. బెడ్రూం ఏసీలో ఐదు పాములు
కేరళలో వెలుగు చూసిన ఈ ఉదంతంలోకి వెళ్లటానికి ముందు ఆ రాష్ట్రంలోని జీవన విధానం గురించి కాస్త చెప్పాల్సిందే.
By: Garuda Media | 7 March 2026 12:16 PM ISTవిన్నంతనే ఉలికిపాటుకు గురయ్యే ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక ఇంటి బెడ్రూం ఏసీలో ఏకంగా ఐదు పాములు ఉన్న విషయాన్ని గుర్తించిన. ఆ ఇంటి వారు వణికిపోయిన పరిస్థితి. లక్కీగా.. ముందే గుర్తించటం.. టెక్నీషియన్ తో పాటు పాముల్ని పట్టుకునే అటవీ శాఖ సాయంతో వారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. బెడ్రూం ఏసీలో ఉన్న పాముల ఉదంతం గురించి విన్నంతనే నోటి వెంట మాట రాదు.
కేరళలో వెలుగు చూసిన ఈ ఉదంతంలోకి వెళ్లటానికి ముందు ఆ రాష్ట్రంలోని జీవన విధానం గురించి కాస్త చెప్పాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో మాదిరి ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్ లేకుండా ఉండటం.. ఇంటి పరిసరాలు విశాలంగా ఉండటం లాంటివి మన దగ్గర అస్సలు కనిపించవు. కానీ.. కేరళలో అందుకు భిన్నం. ఆ మాటకు వస్తే.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలోని ఇళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్ మాత్రమే కాదు.. విశాలంగా ఉండే లోగిళ్లు.. నేచర్ కు దగ్గరిగా వారి ఇల్లు ఉంటాయి.
దీనికి తోడు ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశం మాత్రమే కాదు.. ఇంటికి ఇంటికిమధ్య గ్యాప్ కూడా ఎక్కువే. ప్రతి ఇంట్లోనూ పెద్ద పెద్ద చెట్లు కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. విషయంలోకి వెళితే.. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఇంట్లోని బెడ్రూంలో ఐదు పాములు బయటపడటంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
తిరువనంతపురంలోని శ్రీకార్యం అనే ప్రాంతానికి చెందిన మాధవ్.. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వేళ.. బెడ్రూంలోని ఏసీ కింది భాగంలో ఏదో కదులుతున్నట్లుగా కనిపించింది. దీంతో.. దగ్గరకు వెళ్లిన అతనికి.. ఏసీలో నుంచి శబ్దాలు రావటంతో అలెర్టు అయ్యాడు. ఆ శబ్దాన్నిపాముకు చెందినవిగా అనుమానించిన అతడు.. అటవీ శాఖాధికారులకు సమాచారాన్ని అందించారు.
దీంతో.. అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఏసీ టెక్నీషియన్ సాయంతో తెరిచి చూసి అవాక్కు అయ్యారు. దీనికికారణం అందులో ఐదు పాములు ఉన్నట్లుగా గుర్తించారు. దాదాపు గంటన్నర శ్రమించి నాలుగు పాముల్ని బయటకు తీయగా.. మరొకటి మాత్రం పైపు మార్గంలో బయటకు వెళ్లిపోయింది. ఊపిరిపీల్చుకునే విషయం ఏమంటే.. అటవీ శాఖాధికారులు పట్టేసి నాలుగు పాములు విషపూరితం కావని తేల్చారు. ఇంటికి అనుకొని చెట్టు ఉండటం.. దాని కొమ్మల ద్వారా ఏసీలోకి పాములు చేరి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఏమైనా..ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపింది.
