Begin typing your search above and press return to search.

రేవంత్ కు మొట్ట మొదటి విజ్ఞప్తి ఇదే... లాజిక్ ఉంది!

ఈ నేపథ్యంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల నుంచి రేవంత్ రెడ్డి & కోకి మొట్టమొదటి విజ్ఞప్తి అందింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:57 AM GMT
రేవంత్  కు మొట్ట మొదటి విజ్ఞప్తి ఇదే... లాజిక్  ఉంది!
X

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కేబినెట్ కూర్పులో భాగంగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రానికి హైదరాబాద్‌ కు చేరుకుని గురువారం లాల్ బహదూర్ స్టేడియం (ఎల్బీ స్టేడియం)లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో... మంత్రివర్గ కూర్పుపై కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలో మంత్రుల జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల నుంచి రేవంత్ రెడ్డి & కోకి మొట్టమొదటి విజ్ఞప్తి అందింది. ఈ క్రమంలో... "తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్" ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని విడుదల చేసింది. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన డాక్టర్లందరినీ అభినందిస్తూనే.. తమ కోరికను బయటపెట్టింది. ఇందులో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన డాక్టర్స్ అందరికీ పేరు పేరునా అభినాందనలు తెలియజేసింది.

ఈ సమయంలో... వైద్య వ్యవస్థ ఎలా ఉండాలనే విషయంపై వైద్యులకే సమగ్రమైన అవగాహన ఉంటుందని అసోసియేషన్ తమ వినతిపత్రంలో పేర్కొంది. ఆస్పత్రుల్లో రోగుల అవసరాలు, మెడిసిన్స్ , పరికరాలు, వైద్య - ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలపై డాక్టర్ ఎమ్మెల్యేల సూచనలను కొత్త ప్రభుత్వం స్వీకరించాలని కోరింది.

ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటు కాబోయే తెలంగాణ ప్రభుత్వంలో.. ఓ డాక్టర్‌ ను ఆరోగ్య మంత్రిగా నియమించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేన్ విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇది సరైన సూచన అనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

కాగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్స్ ల నుంచి అసెంబ్లీకి పలువురు వైద్యులు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డాక్టర్ వంశీకృష్ణ - అచ్చంపేట్, డాక్టర్ మురళీ నాయక్ - మహబూబాబాద్, డాక్టర్ సత్యనారాయణ - మానకొండూర్, డాక్టర్ రాం చందర్ నాయక్ - డోర్నకల్, డాక్టర్ పర్ణికా రెడ్డి - నారాయణపేట్, డాక్టర్ సంజీవరెడ్డి - నారాయణఖేడ్, డాక్టర్ మైనంపల్లి రోహిత్ - మెదక్, డాక్టర్ వివేక్ వెంకటస్వామి - చెన్నూర్, డాక్టర్ రంగమయి - సత్తుపల్లి, డాక్టర్ భూపతిరెడ్డి - నిజామాబాద్, డాక్టర్ పాల్వాయి హరీష్ - సిర్పూర్, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి - నాగర్ కర్నూల్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ - కోరుట్ల రూరల్, డాక్టర్ తెల్లం వెంకట్రావ్ - భద్రాచలం, డాక్టర్ సంజయ్ - జగిత్యాల్‌ ఎమ్మెల్యేలుగా గెలిచారు.