Begin typing your search above and press return to search.

ఔరా..’షాన్డిలియర్’గా.. రూ.4 కోట్ల ఫెరారీ కారా?

ఖరీదైన కారును ఎవరైనా ఇంటి ముందు దర్జాగా పార్క్ చేస్తారు.. తమ దర్పం చాటుకుంటారు.. అతడు మాత్రం షాన్డిలియర్ గా వేలాడదీశాడు.

By:  Tupaki Desk   |   20 July 2025 4:00 AM IST
ఔరా..’షాన్డిలియర్’గా.. రూ.4 కోట్ల ఫెరారీ కారా?
X

ఖరీదైన కారును ఎవరైనా ఇంటి ముందు దర్జాగా పార్క్ చేస్తారు.. తమ దర్పం చాటుకుంటారు.. అతడు మాత్రం షాన్డిలియర్ గా వేలాడదీశాడు. అదే గొప్ప అని చెప్పుకొంటున్నాడు.. దుబాయ్ కి చెందిన అతడు ఏదో అరబ్ షేక్ కూడా కాదు.. ఓ కంటెంట్ క్రియేటర్. ఇప్పడు తన కొత్త షాన్డిలియర్ ను అందరికీ ప్రత్యేకంగా చూపిస్తున్నాడు.

ఫెరారీ అంటే.. ఖరీదైన లగ్జరీ బ్రాండ్ అనే సంగతి తెలిసిందే. అలాంటి కారు కొనడమే చాలా పెద్ద గొప్పగా భావిస్తారు. కానీ, ఈ మోటో వ్లాగర్ మాత్రం షాన్డిలియర్ గా మార్చాడు. ఈ కారు ఖరీదు 5 లక్షల డాలర్లు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఎందుకిలా వేస్ట్ చేస్తున్నావ్ బ్రో అని అంటుండగా.. మరికొందరు ఈయన క్రియేటివిటీకి సలామ్ కొడుతున్నారు. ఇలా చేయడం సేఫ్టీయేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి మనం డబ్బు దుబారా అనుకున్నవన్నీ దుబాయ్ లో చాలా సాధారణంగా అనిపిస్తాయేమో? గతంలో ఏడాది వయసు కూతురికి తండ్రి లగ్జరీ బ్రాండ్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇది కస్టమ్ మేడ్.. ఇంగ్లండ్ లో చేయించింది ఎవరో కాదు భారతీయుడే. కారు నేమ్ ప్లేట్ లో ‘‘అభినందనలు ఇసబెల్లా అని తన కూతురి పేరును సూచించాడు.

ఇక తాజా షాన్డిలియర్ కేసుకు వస్తే.. దీనిని మొహమ్మద్ బిరాగ్దరీ రూపొందించాడు. ఇదో అసాధారణం అని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు .@edrive.jetcar తో కలిసి ఫెరారీని ఇలా ఎగరేశాడు. పైకి చూడడానికి అలంకరణలా ఉన్నా.. బరువు రీత్యా సేఫ్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. కాగా, ’షాన్డిలియర్ అలంకరణ’ను అతడు వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది..? 2.3 కోట్ల మంది చూశారు. 8 లక్షల మంది లైక్ కొట్టారు. ప్రశంసించేవారు ప్రశంసిస్తుండగా.. విమర్శకులు నోటికి పనిచెబుతున్నారు.

కొందరైతే ఫెరారీకి బదులుగా 5 లక్షల డాలర్ల విలువైన మోడల్ లేదా ప్రతిరూపం అయి ఉంటుందని పేర్కొంటున్నారు. మరి అలాంటిదానికే 5 లక్షల డాలర్లు ఖర్చు పెడితే అతడు మోసపోయినట్లే అని ఇంకొకరు అన్నారు. బ్రో.. భూకంపాలు సంభవిస్తే ఎలా అని మరొకరు ప్రశ్నించారు. ప్లాస్టిక్ బొమ్మ వేలాడుతున్నట్లు భయంకరంగా ఉంది అని కొందరు వ్యాఖ్యానించారు.