ఏపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల భయం మొదలైందా..!
గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్లు పెద్దగా కనిపించలేదు.
By: Tupaki Desk | 28 Feb 2024 11:37 AM ISTపార్టీల నుంచి టికెట్ అందని వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్న విషయం కొత్తకాదు. అయితే.. రాను రాను.. దేశంలో ఇండిపెండెంట్లు తగ్గుతున్నారు. ఎన్నికల ఖర్చులు, పోటీ, ప్రధాన పార్టీల సంఖ్య పెరగడం.. అభ్యర్థుల కుల, ఆర్థిక పరిస్థితులు వంటివి ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇండిపెండెం ట్లుగా పోటీ చేసేవారి సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్లు పెద్దగా కనిపించలేదు.
ఇక, ఇప్పుడు ఏపీలో మరో 40 రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో పార్టీలు టికెట్లను ప్రకటిం చడం ప్రారంభించాయి. వీటిలో ఆశాభంగానికి గురైన నాయకులు ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు. దీంతో వారి కాక పెరిగితే.. ఎన్నికల్లో ఓట్లు చీలే అవకాశం మెండుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీల కులు. కర్నూలు ఎంపీ టికెట్ ఆశించిన వైసీపీ నాయకుడు సంజీవ్ కుమార్.. త్వరలోనే తన ప్రకటన చేయనున్నారు. ఆయన పార్టీలు మారే ఉద్దేశం లేదని,,ఒంటరి ఓరుకు రెడీ అని అంటున్నారు.
ఇక, నూజివీడు నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తున్నా రు. తన వర్గాన్ని మచ్చిక చేసుకుంటున్నారు. తనవైపు తిప్పుకొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ టికెట్ లేదంటే.. వైసీపీ ఇస్తుందని బావించారు. కానీ, వైసీపీలోనూ చోటు ఇవ్వలేదు. వైసీపీలో సీనియర్ నాయకుడు ఉన్నారు.
దీంతో ముద్దరబోయిన స్వతంత్రంగా పోటీకి రెడీ అయ్యారు. ఇక, అవనిగడ్డ టికెట్ ఆశించి భంగపడిన.. మండలి బుద్ద ప్రసాద్ కూడా.. ఇదే దారి పడుతున్నారని తెలుస్తోంది. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయి తే..ఆయనకు వైసీపీలో చేరే ఉద్దేశం లేదు. దీంతో కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేయాలని చూస్తున్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల తనకు టికెట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారే తప్ప.. పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు. ఆయన కానీ, ఆయన కుమారుడు కానీ ఒంటరిగా పోటీ చేసే.. అవకాశం ఉంది.
