Begin typing your search above and press return to search.

అప్డేట్ చేసుకోకుంటే ఫాస్టాగ్ లు బ్లాక్ చేస్తారట బాస్

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 31 డెడ్ లైన్ తీసుకురావటం తెలిసిందే. కేవైసీలను పూర్తి చేయని ఫాస్టాగ్ లను నిలిపేసేందుకు వీలుగా కేంద్రం సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   16 Jan 2024 4:41 AM GMT
అప్డేట్ చేసుకోకుంటే ఫాస్టాగ్ లు బ్లాక్ చేస్తారట బాస్
X

టోల్ వసూళ్లను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన ఫాస్టాగ్ ల్ని అప్డేట్ చేసుకోవాలన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 31 డెడ్ లైన్ తీసుకురావటం తెలిసిందే. కేవైసీలను పూర్తి చేయని ఫాస్టాగ్ లను నిలిపేసేందుకు వీలుగా కేంద్రం సిద్ధమైంది. ఇలాంటివాటిని జనవరి 31, 2024 తర్వాత బ్యాంకులు డీ యాక్టివేట్ చేయటంతో పాటు.. బ్లాక్ చేస్తాయని ఎన్ హెచ్ఎఐ ప్రకటించింది. అంతేకాదు.. ఫాస్టాగ్ లను అప్డేట్ చేయకుంటే.. అందులో బ్యాలెన్స్ ఉన్నప్పటికి బ్యాంకులు వాటిని డీయాక్టివేట్ చేస్తాయని పేర్కొన్నారు.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఫాస్టాగ్ కేవైసీలను వెంటనే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే..కొందరు తమ ఫాస్టాగ్ లను వాహనం ముందు భాగంలో ఏర్పాటు చేసుకోకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి కారణాలతో టోల్ ప్లాజాల వద్ద ఆలస్యమవుతుందని.. ఇతర ప్రయాణికులు వారి కారణంగా అసౌకర్యానికి గురవుతున్నట్లుగా పేర్కొన్నారు.

కొందరు అతితెలివిని ఉపయోగిస్తూ.. ఒకే ఫాస్టాగ్ లను పలు వాహనాలకు ఉపయోగిస్తున్న విధానాన్ని గుర్తించారు. అదే టైంలో ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్ లను లింకే చేయటాన్ని గుర్తించారు. కేవైసీని పూర్తి చేయకుండానే ఫాస్టాగ్ లను జారీ చేస్తున్నట్లుగా గుర్తించిన కేంద్రం.. ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా.. ఒక వాహనం.. ఒకటే ఫాస్టాగ్ అన్న విధానం దిశగా అడుగులు వేస్తోంది. తమ ఫాస్టాగ్ కేవైసీల పూర్తికి సంబంధించి బ్యాంకుల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకైనా మంచిది.. మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తి అయ్యిందా? లేదా? అన్నది ఒకసారి చెక్ చేసుకోండి.