చిరుత కంటే మూడు రెట్ల వేగం దీని సొంతం... అదేమిటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవి పెరెగ్రైన్ ఫాల్కన్. ఈ పెరెగ్రైన్ ఫాల్కన్ ఎరను వేటాడేటప్పుడు గంటకు ఏకంగా 386 కిలోమీటర్ల వేగంతో డైవ్ చేస్తుంది.
By: Tupaki Desk | 19 July 2025 1:00 AM ISTజంతు రాజ్యంలో వేగం అనేది వాటి మనుగడకు అత్యాంత కీలకమైన లక్షణం అనే చెప్పాలి. ఇక్కడ వేటాడి తిని బ్రతకాలన్నా, తమపై దాడి చేసే మరో జంతువు బారిన పడకుండా తప్పించుకోవాలన్నా ఈ వేగమే కీలకం. వేగం ఉంటే బ్రతుకు, మనుగడ.. వేగం తగ్గితే బలి, మరణం అనే పరిస్థితి. ఈ సమయంలో భూమిపైనా, నీటిలోనోనూ, గాలిలోనూ అత్యంత వేగమైన ప్రాణులేవనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... భూమి, నీరు, గాలి... వాతావరణం ఏదైనా, ప్రదేశం మరేదైనా జంతు రాజ్యంలో మనుగడకు వేగమే కీలకం. ఈ సమయంలో ఈ మూడు చోట్లా వేగవంతమైన ప్రాణులను ఇప్పుడు చూద్దామ్.. అందులో టాప్ 10 ఇవే! ఇందులో తొలుత భూమిపై అత్యంత వేగవంతమైన జంతువుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..!
* భూమిపై తిరుగులేని వేగం కలిగిన జంతువుల్లో చిరుత ఒకటి. వేగానికి గుర్తుగా దీన్ని అభివర్ణిస్తారు. సుమారు 1,500 అడుగుల తక్కువ దూరం ప్రయాణించడంలోనే ఇది గంటకు 120 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు.
* చిరుత తర్వాత భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు ప్రాంగ్ హార్న్ యాంటెలోప్.. ఉత్తర అమెరికాలో కనిపించే ఈ జంతువు గంటకు 88 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. అందుకే భూమిపై వేగంగా ప్రయాణించగలిగే వాటిలో ఇది రెండో స్థానంలో ఉంది.
* వీటి తర్వాత దక్షిణాఫ్రికా జింక అయిన స్ప్రింగ్ బాక్ నిలిచింది. ఇది గంటకు 88 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దాని వేగాన్ని వేటాడే జంతువుల నుండి తప్పించుకుంటుంది.. మనుగడ కాపాడుకుంటుంది.
* ఇదే క్రమంలో భూమిపై అత్యంత వేగంగా పరుగెత్తగల జంతువుల్లో గుర్రపు జాతిగా పరిగణించబడుతున్న క్వార్టర్ హార్స్ ఆ తర్వాత స్థానంలోఉంది. ఇది తక్కువ దూరంలోనే గంటకు 88 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
* ఇక... వేగం విషయంలో ఆ తదుపరి స్థానంలో 'మృగరాజు' సింహం ఇందు. ఇది కూడా గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అయితే ఇది తక్కువ దూరమే పరిగెత్తగలదు. ఇది సుదూర పరుగు పందెం కంటే ఆకస్మిక వేటపైనే ఎక్కువగా ఆధారపడుతుంది.
ఇప్పుడు నీటిలో అత్యంత వేగవంతమైన జీవుల వివరాలు చూద్దామ్.. ఇందులో ప్రధానంగా రెండు రకాల చేపలు అత్యంత వేగాన్ని కలిగి ఉంటాయి. ఇందులో భాగంగా..
* సెయిల్ ఫిష్ అత్యంత వేగవంతమైన ఈతగాడు అనే బిరుదును కలిగి ఉంది. ఈ చేప వేటాడేటప్పుడు గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
* దీని తర్వాత స్థానంలో... మార్లిన్ అనే మరో చేప ఉంది. ఇది కూడా అద్భుతమైన వేగవంతమైన చేపగా గుర్తింపు పొందింది. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదగలదు.
ఇప్పుడు చెప్పుకున్న భూమిపై పరుగెత్తేవి, నీటిలో వేగంగా ఈదేవాటికి మించి అన్నట్లుగా గాల్లో అత్యంత వేగంగా ప్రయాణించగలిగే ప్రాణులను చూద్దామ్..! ఇవి భూమిపై చిరుత రికార్డును, నీటిలో సెయిల్ ఫిష్ రికార్డును అదిగమించి టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.. పెరెగ్రైన్ ఫాల్కన్!
* ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవి పెరెగ్రైన్ ఫాల్కన్. ఈ పెరెగ్రైన్ ఫాల్కన్ ఎరను వేటాడేటప్పుడు గంటకు ఏకంగా 386 కిలోమీటర్ల వేగంతో డైవ్ చేస్తుంది.
* దీని తర్వాత గోల్డెన్ ఈగిల్ అనే గంభీరమైన పక్షి.. డైవ్ లో గంటకు 322 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
* ఇదే సమయంలో... వైట్ త్రోటెడ్ నీడిల్ టైల్ పక్షి.. అత్యంత వేగంగా ఎగరగలిగే పక్షుల్లో ఒకటి. ఇది డైవింగ్ లేకుండా గంటకు 169 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
