Begin typing your search above and press return to search.

భార్యను విడిచిపెట్టి, తనతో వివాహానికి నిరాకరించాడని.. షాకింగ్ ఘటన!

ఇక.. అవివాహ సంబంధాల మధ్య జరుగుతున్న వ్యవహారాలు.. వాటి కారణంగా వెలుగులోకి వస్తోన్న దారుణాల గురించి చెప్పే పనే లేదు.

By:  Tupaki Desk   |   17 April 2025 1:21 PM IST
భార్యను విడిచిపెట్టి, తనతో వివాహానికి నిరాకరించాడని.. షాకింగ్  ఘటన!
X

ఇటీవల కాలంలో దాంపత్య జీవితంలోనూ.. అవివాహ సంబంధాల్లోనూ చోటు చేసుకుంటున్న క్రైం వ్యవహారాలు సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే! భర్తను చంపి డ్రమ్ లో వేయడం, భార్య వేధింపులు తాళలేక వీడియో తీసుకుంటూ ఉరి వేసుకోవడం, సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు వెల్లడించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

ఇక.. అవివాహ సంబంధాల మధ్య జరుగుతున్న వ్యవహారాలు.. వాటి కారణంగా వెలుగులోకి వస్తోన్న దారుణాల గురించి చెప్పే పనే లేదు. ఈ క్రమంలో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తనతో రెండో వివాహానికి నిరాకరించాడని ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతని శరీరంలో 13 చోట్ల ఎముకలు విరిగాయి!

అవును... హర్యానాలోని ఫరిదాబాద్ లో ఓ వివాహితుడు తన భార్య, పిల్లలను విడిచిపెట్టి తనను వివాహం చేసుకోవాలని తన స్నేహితురాలితో పదే పదే ఒత్తిడి చేయబడ్డాడు! అయినప్పటికీ అతడు అందుకు నిరాకరించడంతో అతని స్నేహితురాలు కుటుంబ సభ్యులతో కలిసి తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపించాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... గుల్షన్ బజరంగీ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. అతడు గుంజన్ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. తనను వివాహం చేసుకోవాలని గుంజన్.. గుల్షన్ పై రెగ్యులర్ గా తీవ్ర ఒత్తిడి చేసేదని, ఈ సమయంలో ఓ షాకింగ్ సలహా కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... తన భార్య, పిల్లలకు విడాకులు ఇవ్వాలని.. లేదా, వారికి విషం ఇచ్చి చంపాలని ఆమె సూచించిందని గుల్షన్ ఆరోపిస్తున్నాడు. పైగా.. ఆ మేరకు పలు ఉపాయాలు పన్నిందని అంటున్నాడు. ఈ సమయంలో మార్చి 18-23 మధ్య తనను బంధించిందని, అదుపులో ఉంచడానికి మత్తు పదార్థాలు ఉపయోగించిందని అతడు ఆరోపించాడు.

ఈ సమయంలో మార్చి 29న తాను ఆమెకు గతంలో ఇచ్చిన రూ.21.50 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుల్షన్ తెలిపాడు. ఈ సమయంలో.. గుంజన్, ఆమె తండ్రి రాకేష్, తల్లి కిరణ్ కమల్ తో పాటు మన్ను హనీ అనే వ్యక్తి తనపై కర్రలతో, కత్తులతో, సాయుధులైన అనేక మందితో కలిసి దాడి చేశారని అతడు చెబుతున్నాడు.

దాడిలో తీవ్రంగా గాయపడిన గుల్షన్.. పోలీసులకు ఫోన్ చేసి సహాయం కోరగా.. వారు అతని వద్దకు చేరుకుని, స్థానిక ఆసుపత్రికి అతన్ని తీసుకెళ్లి, అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అతడు చాలా రోజులుగా ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉన్నాడని, కోలుకోవడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.