Begin typing your search above and press return to search.

వీడియో... షోయబ్ మూడో భార్యను ఆటపట్టించిన ఫ్యాన్స్!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావే‌ద్‌ ను అభిమానులు ఆటపట్టించారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:37 AM GMT
వీడియో... షోయబ్  మూడో భార్యను ఆటపట్టించిన ఫ్యాన్స్!
X

ఒకప్పుడు నెట్టింట, ప్రధానంగా స్పోర్ట్స్ జోన్ లో షోయబ్ మాలిక్ - సానియా మీర్జా జంట వైరల్ టాపిక్ గా ఉండేవారనేది తెలిసిన విషయమే. అప్పటికే సానియా మీర్జాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు షోయబ్ ఫుల్ ఫాం లో ఉండటంతో అటు క్రికెట్, ఇటు టెన్నీస్ ఫ్యాన్స్ వీరిని ఫుల్ గా ఫాలో అవుతూ ఉండేవారు! ఈ క్రమంలో ఈ జంట ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ మూడో భార్యను ఫ్యాన్స్ ర్యాగింగ్ చేస్తున్నారు!

అవును... సానియా మీర్జాతో సుమారు 14 ఏళ్ల వివాహ బంధాన్ని షోయబ్ మాలిక్ తెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ ను షోయబ్ వివాహం చేసుకున్నాడు. కాగా... ఇది షోయబ్ మాలిక్‌ కు మూడో పెళ్లి. మాలిక్ తన ఫస్ట్ వైఫ్ అయేషా సిద్ధిఖి తో విడాకుల అనంతరం.. 2010లో సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. వీరికి 2010లో ఓ బాబు కూడా పుట్టాడు.

ఈ క్రమంలో తన మూడో పెళ్లిపై స్పందించిన మాలిక్... మనసుకు నచ్చిన పని చేయాలని, జనాలు ఏమనుకుంటున్నారనేది ఏమాత్రం ఆలోచించకూడదని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి... సానియాతో వివాహ బంధం కొనసాగిస్తూనే సనా జావేద్‌ తో షోయబ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు వినిపించాయి. దీనివల్లే షోయబ్ మాలిక్‌ కు విడాకులు ఇచ్చేసి సానియా భారత్‌ కు వచ్చేసింది.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావే‌ద్‌ ను అభిమానులు ఆటపట్టించారు. ఇందులో భాగంగా... పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీ.ఎస్‌.ఎల్) - 2024 సీజన్‌ లో షోయబ్ మాలిక్‌ కు మద్దతు తెలిపేందుకు స్టేడియంకు వచ్చిన ఆమెను.. సానియా మీర్జా అంటూ టీజ్ చేశారు. ఈ సందర్భంగా సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు.

దీంతో ఇబ్బంది పడిన సనా... తీవ్ర అసంతృప్తికి లోనై అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. షోయబ్ మాలిక్ - సానియా మీర్జా విడిపోవడం ఇష్టం లేని వారి ఫ్యాన్స్... అందుకు కారణమైనట్లు చెబుతున్న సనాను ఇలా ఇబ్బందిపెట్టారని అంటున్నారు.