Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... ఫేక్ ఫోటోస్ @ 2024 ఎలక్షన్స్!

భారతదేశం మొత్తం లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 5:39 AM GMT
వైరల్  ఇష్యూ... ఫేక్  ఫోటోస్ @ 2024 ఎలక్షన్స్!
X

భారతదేశం మొత్తం లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో.. ఈ ఎన్నికల్లో గెలవాలని కృతనిశ్చయంతో ఉన్న కొంతమంది పాజిటివ్ ప్రచారాలతో.. పాజిటివ్ ఓటు బ్యాంకు లక్ష్యంగా ముందుకు సాగుతుండగా.. మరికొంతమంది ఫేక్ ప్రచారాలతో ఏదోలా గట్టేక్కాలని చూస్తున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయాల్లో బలంగా నడుస్తుంది.

పైగా ఈ ఎన్నిక్కల్లో సోషల్ మీడియా ప్రచారం అత్యంత కీలక భూమిక పోషించబోతుందని చెబుతున్నారు. బలమైన మీడియా సపొర్ట్ లేనివారికి.. ఆయా మీడియాల్లో వచ్చే ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి.. ఇప్పుడు ఈ సోషల్ మీడియానే అతిపెద్ద అస్త్రం అని చెబుతున్నారు. అలాకానిపక్షంలో.. నిజం చెప్పులేసుకునేలోపు, అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుంది అన్నట్లుగా పరిస్థితి మారిపోతుందని చెబుతున్నారు.

ఇలా కొంతమంది నేతలు... వారిపై వచ్చే ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడానికి సోషల్ మీడియాపై ఆధారపడుతుంటే... ఇంకొంతమంది మాత్రం ఫేక్ ప్రచారం కోసమే సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రకటనల సంగతి సరేసరి.. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ భారీ ఎత్తున ప్రకటలు కుమ్మరిస్తుందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆరెస్సెస్, బీజేపీ నేత రామ్ మాధవ్‌ తో భేటీ అయ్యారంటూ ఒక ఫోటో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ జగన్... రామ్ మాధవ్‌ తో భేటీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ ఫోటోపై టెక్స్ట్ కూడా రాశారు.

ఇందులో భాగంగా... "ఆరెస్సెస్ ప్రముఖ నాయకుడిని జగన్ ఎందుకు కలిసినట్లు. వైసీపీలో ఉన్న ముస్లింలకు ఇది మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది" అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫోటో ఎవరు పోస్ట్ చేశారనే విషయంపై చాలా మందికి క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... దీనిపై ఒక సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేసింది. దీంతో అసలు వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలో జగన్.. రామ్ మాధవ్ తో భేటీ అయ్యారని వస్తున్న వార్తలు అబద్ధమని ఫ్యాక్ట్‌ చెక్‌ లో తేలింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ఇప్పటిది కాదని తేలింది. ఆ ఫోటో 2019 నాటిది అని ఫ్యాక్ట్‌ చెక్‌ లో వెల్లడైంది. ఆ ఫోటో 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కలిసినప్పుడు తీసిందని తేలింది. ఈ ఫోటో 2019 మే 26న ఏ.ఎన్.ఐ. న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన వార్తలో కనిపించింది!

దీంతో... ప్రజలను, ఏపీలోని మైనారిటీలనూ తప్పుదోవ పట్టించడానికి కొంతమంది చేసిన తప్పుడు పనిగానే ఇది తేలినట్లయ్యింది. ఈ నేపథ్యంలో... సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం విషయంలో పార్టీలు అప్రమత్తంగా ఉండాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో... తప్పుడు ప్రచారాలు చేసేవారి ఉద్దేశ్యాలను ప్రజలు గహించాలని కోరుతున్నారు!!

ఇది మచ్చుకు ఒక తాజా ఉదాహరణ మాత్రమే! ఈ క్రమంలో పార్టీ ఏదైనా, నేతలెవరైనా... ఈ ఎన్నికల్లో ఫేక్ ప్రచారం తప్పదనే చర్చ బలంగా వినిపిస్తుంది! అయితే అన్ని పార్టీలూ ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని.. ఫేక్ ప్రచారలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా పాత్ర రెండు రకాలుగానూ అత్యంత కీలకం అని గుర్తు చేస్తున్నారు!