Begin typing your search above and press return to search.

లోక్ సభ పోరులో 6గురు మాజీ సీఎంలు.. రిచ్చెస్ట్ ఈయనే!

అవును... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని గట్టి పట్టుదలపై ఉన్న భారతీయ జనతాపార్టీ... అభ్యర్థుల ఎంపికలో కీలక మార్పులు చేసింది.

By:  Tupaki Desk   |   30 March 2024 5:30 PM GMT
లోక్  సభ పోరులో 6గురు మాజీ సీఎంలు.. రిచ్చెస్ట్  ఈయనే!
X

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోన్న సంగతి తెలిసిందే! దీంతో... అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను ఈసారి లోక్ సభ బరిలో నిలబెట్టింది. ఈ సమయంలో ఆ ఆరుగురు మాజీ సీఎం లు ఎవరు.. వారి వారి ఆస్తుల వివరాలు ఎంత అనేది ఇప్పుడు చూద్దాం!!

అవును... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని గట్టి పట్టుదలపై ఉన్న భారతీయ జనతాపార్టీ... అభ్యర్థుల ఎంపికలో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను ఈసారి లోక్ సభ బరిలో నిలిపింది. ఇందులో భాగంగా... హర్యానా నుంచి మనోహర్ లాల్.. కర్ణాటక - బసవరాజ్ బొమ్మై.. ఉత్తరాఖండ్ - త్రివేంద్రసింగ్ రావత్.. త్రిపుర – బిప్లబ్ దేవ్.. మధప్రదేశ్ – శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏపీ – కిరణ్ కుమార్ రెడ్డిలు ఈసారి ఎంపీలుగా బరిలోకి దిగుతున్నారు.

మనోహర్ లాల్:

హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఆస్తుల విలువ కోటీ ఇరవై ఏడు లక్షల రూపాయలుగా ఉందని తెలుస్తుంది. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్ లో.. తన బ్యాంక్ ఖాతాలో సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రూ.5 లక్షల పర్సనల్ లోన్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక స్థిరాస్థి విషయానికొస్తే... రూ.50 లక్షలకు పైగా విలువైన అగ్రికల్చరల్ ల్యాండ్ తో పాటు రూ. 3 లక్షల విలువైన ఇల్లు కూడా ఉందని చెబుతున్నారు!

బసవరాజ్ బొమ్మై:

మనోహర్ లాల్ లెక్కలు అలా ఉంటే... ఇక కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్తులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. గత ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ లోని వివరాల ప్రకారం ఆయన రూ. 42.15 కోట్ల స్థిరాస్తులను కలిగి ఉన్నారు. వీటిలో హిందూ అవిభక్త ఫ్యామిలీకి చెందిన ఆస్తులు సుమారు రూ. 19.2 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మార్చి 26 - 2022న తరిహాల గ్రామంలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పేక్రొన్నారు. ఈ క్రమంలోనే 2023 నాటి అఫిడవిట్ ప్రకారం బొమ్మైతో పాటు ఆయనపై ఆధారపడిన వారి మొత్తం ఆస్తుల విలువ రూ.52.12 కోట్లుగా ఉంది!

త్రివేంద్ర సింగ్ రావత్:

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల సమర్పించిన అఫిడవిట్ లో తన వద్ద రూ. 56 వేలు, తన భార్యవద్ద రూ. 32 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో... అతని బ్యాంక్ ఖాతాలో రూ. 59,88,913.. అతని భార్య బ్యాంకు ఖాతాలో రూ.94,80,261 ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమలో తమవద్ద ఉన్న మిగిలిన వస్తువులు, ఆస్తుల వివరాలనూ వెల్లడించారు.

ఇందులో భాగంగా... తనవద్ద ఉన్న 40 గ్రాముల బంగారం విలువ సుమారు రెండున్నర లక్షలు కాగా.. తన భార్య వద్ద ఉన్న 110 గ్రాముల బంగారం విలువ రూ.6,79,800 అని వెల్లడించారు. ఇదే క్రమంలో... తనకు రూ.62,92,113.. తన భార్యకు రూ.1,01,92,061 విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు!

ఇవి కాకుండా... వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర, పూర్వికులు ఇచ్చిన ఆస్తులు అన్నీ కలిపి సుమారు రూ.4,01,99,805.. తన భార్య పేరున రూ.1,08,68,060 విలువైన స్థిరాస్తి ఉందని చెప్పిన త్రివంద్ర సింగ్ రావత్... వీటితో పాటు బ్యాంక్ లో రూ. 75 లక్షల లోన్ కూడా ఉన్నట్లు తెలిపారు!

బిప్లబ్ కుమార్ దేబ్:

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్... ఇటీవల సమర్పించిన తన అఫిడవిట్ లో తన వద్ద సుమారు. రూ.52,000.. తన భార్య వద్ద రూ.2,400 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో తనకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.92,78,838.. తన భార్య బ్యాంక్ అకౌంట్స్ లో రూ.1,07,47,000 ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో తనవద్ద ఉన్న బంగారం విలువ సుమారు రూ.3 లక్షలు కాగా.. తన భార్య వద్ద ఉన్న బంగారం విలువ సుమారు రూ.7 లక్షలు అని తెలిపారు. ఈ క్రమంలో నగలుతో పాటు రూ.95,78,838 విలువైన చరాస్తులు.. రూ.1,89,17,755 విలువైన స్థిరాస్థి తన పేరుమీద ఉండగా.. రూ.61 లక్షల విలువైన స్థిరాస్థి తన భార్య పేరున ఉందని వెల్లడించారు.

శివరాజ్ సింగ్ చౌహాన్:

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తి రూ.3.21 కోట్లు కాగా.. తన భార్య పేరుమీద ఉన్న మొత్తం ఆస్తులు రూ.5.41 కోట్లు అని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... తన పేరుమీద రూ.1,11,20,282 విలువైన చరాస్తులు, రూ.2.10 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు.. తన భార్య పేరుమీద రూ.1,09,14,644 చరాస్థులు... రూ.4.32 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్ల్డించారు.

కిరణ్ కుమార్ రెడ్డి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.19 కోట్లు అని చెబుతున్నారు! ఆయనకు జూబ్లీహిల్స్ లో సుమారు రూ.9 కోట్ల విలువైన బంగ్లాతో పాటు మార్తుతీ, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎస్ యూవీ, ఫోక్స్ వ్యాగన్ తదితర కార్లు ఉన్నాయి!