Begin typing your search above and press return to search.

నరవణె ఆత్మకథ: వివాదాస్పద బుక్ లో ఏముంది? ఎలా లీకైంది?

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   10 Feb 2026 10:00 AM IST
నరవణె ఆత్మకథ:  వివాదాస్పద బుక్ లో ఏముంది? ఎలా లీకైంది?
X

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ పుస్తకం మార్కెట్లోకి రాకముందే పిడిఎఫ్ రూపంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం రక్షణ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె తన సర్వీసు కాలంలోని కీలక పరిణామాలతో రాసిన ఆత్మకథ ప్రచురణకు ముందే చిక్కుల్లో పడింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు బయటకు రావడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

పిడిఎఫ్ లీకేజీపై సీరియస్ అయిన ఢిల్లీ పోలీసులు

అధికారికంగా విడుదల కావాల్సిన ఈ పుస్తకం, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా పీడీఎప్ ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీనిని తీవ్రమైన భద్రతా లోపంగా భావిస్తున్న ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.ఈ ఫైల్ ఎక్కడి నుంచి సోర్స్ అయ్యింది? పబ్లిషింగ్ హౌస్ నుంచి లీక్ అయిందా లేక ప్రభుత్వ వర్గాల నుంచా? అనే కోణాల్లో సైబర్ క్రైమ్ విభాగం విచారణ చేపట్టింది.

రాజకీయ సెగ: లోక్‌సభలో రచ్చ

ఈ వివాదం కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా పార్లమెంటును సైతం తాకింది. సరిహద్దుల్లో చైనాతో జరిగిన గొడవలపై ఈ పుస్తకంలో షాకింగ్ నిజాలు ఉన్నాయని, అందుకే ప్రభుత్వం దీనిని అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ భద్రత దృష్ట్యానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధికార పక్షం వాదించడంతో ఉభయ సభల్లో వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రచురణ నిలిపివేత.. కేంద్రం స్పష్టత

ఈ పుస్తకం ఇకపై ఎప్పటికీ అధికారికంగా ప్రచురితం కాబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ భద్రతకు భంగం కలిగించే అంశాలు, సున్నితమైన సరిహద్దు సమాచారం ఈ పుస్తకంలో ఉండటం వల్ల దీనికి క్లియరెన్స్ లభించలేదు అని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పబ్లిషర్లు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు.

ఇది భద్రతా లోపమా? కుట్రనా?

అసలు ప్రచురణే వద్దన్న పుస్తకం బయటకు రావడం వెనుక ఏదైనా విదేశీ శక్తుల ప్రమేయం ఉందా? లేక అంతర్గత కుట్రనా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ దర్యాప్తులో తేలే అంశాలు దేశ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.

నరవణె పుస్తకంలో ఏముంది?

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' అనే ఆత్మకథ ప్రధానంగా ఆయన సైనిక జీవితం, అనుభవాలు.. దేశ రక్షణకు సంబంధించిన కీలక ఘట్టాల చుట్టూ తిరుగుతుంది. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల గురించి ఇందులో లోతైన విశ్లేషణ ఉంది. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి, భారత సైన్యం తీసుకున్న నిర్ణయాల గురించి ఆయన వివరించారు.రిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న వ్యూహాలు, భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు , సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యల గురించి నరవణె ప్రస్తావించారు.భారత సాయుధ దళాలలో తీసుకువచ్చిన ఆధునీకరణ, 'అగ్నిపథ్' వంటి పథకాలపై ఉన్న అభిప్రాయాలు.. త్రివిధ దళాల మధ్య సమన్వయం వంటి అంశాలను ఆయన చర్చించారు.

ఒక సాధారణ సైనికుడి స్థాయి నుంచి భారత ఆర్మీ చీఫ్‌గా ఎదిగిన ఆయన వ్యక్తిగత ప్రయాణం, కెరీర్‌లో ఎదుర్కొన్న క్లిష్ట సమయాలు.. నేర్చుకున్న పాఠాలను ఇందులో పంచుకున్నారు.

తీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు ముఖ్యంగా చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఈ పుస్తక ప్రచురణను ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇదే లీక్అయ్యి వివాదానికి దారితీసింది..