Begin typing your search above and press return to search.

కి.మీ.కు రూ.5 ఖర్చు: తొలిసారి ఆకాశంలో దూసుకెళ్లిన ఈవీ విమానం

ఈవీ స్కూటర్.. ఈవీ కారు.. ఈవీ బస్సు.. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు వాహన రంగంలో క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 10:23 AM IST
కి.మీ.కు రూ.5 ఖర్చు: తొలిసారి ఆకాశంలో దూసుకెళ్లిన ఈవీ విమానం
X

ఈవీ స్కూటర్.. ఈవీ కారు.. ఈవీ బస్సు.. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు వాహన రంగంలో క్రియేట్ చేస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. ఇలాంటి వేళ.. తాజాగా ఈవీ మరో సంచలనానికి తెర తీసింది. ఏకంగా ఈవీ విమానాన్ని తయారు చేయటమే కాదు.. చరిత్రలో తొలిసారి ఆకాశంలోకి దూసుకెళ్లింది. దీంతో.. ఈవీ విమానం ఇప్పుడు రియాల్టీలోకి వచ్చినట్లైంది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ కంపెనీ ఈ కొత్త చరిత్రకు తెర తీసింది. వాహన రంగంలో ఇదో విప్లవంగా అభివర్ణిస్తున్నారు.

విమానయాన రంగానికి ఈవీ గేమ్ ఛేంజర్ గా మారుతుందని అంచనాలు వేస్తున్నారు. విమానయానానికి భారీ ఖర్చు.. ఈవీ కారణంగా చాలా తక్కువకే పూర్తి కానుంది. అమెరికాకు చెందిన సిద్ధం చేసిన ఆలియా సీఎక్స్ 300 పేరున్న ఈ ఈవీ విమానం నలుగురు ప్రయాణికులతో నడిపి చూశారు. అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెన్నడీ విమానాశ్రయం వరకు తొలి ప్రయాణం సాగింది.

ఈస్ట్ హ్యాంప్టన్ - కెన్నడీ ఎయిర్ పోర్టుకు మధ్య దూరం 130కి.మీ. నాటికల్ మైళ్లలో చెప్పాలంటే 70. ఈ దూరాన్ని ఈవీ విమానం 30 నిమిషాల్లో అధిగమించింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నది దీనికి అయిన ఇంధన ఖర్చు. కేవలం 8 డాలర్లు మాత్రమే. అంటే.. మన రూపాయిల్లో రూ.694 మాత్రమే. అంటే.. కిలోమీటర్ కు రూ.5.30 మాత్రమే. సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తే కనీసం 160 డాలర్లు అవుతుంది. అంటే.. మన రూపాయిల్లో రూ.13,885.

అందులో 20 శాతం ఖర్చుతోనే ఈవీ విమానం ప్రయాణించటం ఆసక్తికరంగా మారింది. పైలెట్ కు ఇచ్చే వేతం.. విమానం నిర్వహణ..ఇతర ఖర్చులు మిగిలిన వాటికి ఎలానో.. దీనికి అంతే. కాకుంటే ఇంధనం ఖర్చు భారీగా తగ్గిపోవటమే ఈవీ విమానాల ప్రత్యేకతగా చెప్పాలి. ఈవీ విమానం లోపల ఎలాంటి శబ్దం ఉండదని..ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మరింత సులువుగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఈవీ విమానం (ఆలియా)ను ఒకసారి ఛార్జింగ్ పెడితే 250 నాటికల్ మైళ్లు. కిలోమీటర్లలో చెప్పాలంటే 463గా చెప్పొచ్చు. దగ్గర దూరాలకు ఈ విమానాలు సరిపోతాయని చెప్పొచ్చు. అయితే.. ఈ విమానానికి ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకుంటే.. వాణిజ్య అవసరాలకు వీటిని ఉపయోగించుకునే వీలుంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఈవీ విమానాలు ఎయిర్ ట్యాక్సీలుగా పని చేస్తాయని చెబుతున్నారు. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ తో జరిగే ఒలింపిక్స్ లో ట్రాఫిక్ చిక్కులకు ఈ బుల్లి విమానాలు ఎంతో సాయం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.