Begin typing your search above and press return to search.

ఈటెల కాంగ్రెస్ కి జై కొట్టబోతున్నారా...!?

ఈటెల రాజేందర్ బీజేపీలో సెగలూ పొగలూ తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన ఏదో ఆశించి వస్తే ఏదో జరిగింది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 3:49 AM GMT
ఈటెల కాంగ్రెస్ కి జై కొట్టబోతున్నారా...!?
X

ఈటెల రాజేందర్ బీజేపీలో సెగలూ పొగలూ తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయన ఏదో ఆశించి వస్తే ఏదో జరిగింది. అయితే ఆయన రెండేళ్ల క్రితం అధికార బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆశ్రయించడం అప్పటికి కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటూ నాడు బలంగా ఉన్న బీఆర్ఎస్ ని తట్టుకోవడం అంటే కష్టమే మరి.

ఇక నాడు చూస్తే బీజేపీ కాంగ్రెస్ కంటే కొంత ఊపులో ఉన్నట్లుగా కనిపించింది. మొత్తానికి ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిచి కేసీఅర్ కి షాక్ ఇచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం తాను ఆరేడు సార్లు గెలిచిన హుజూరాబాద్ లో తొలిసారి ఓటమి చెందడం మాత్రం ఈటెల రాజకీయ జీవితానికే భారీ షాక్ గా మారింది.

దాంతో రెండున్నర దశాబ్దాల ఈటెల రాజకీయ జీవితం ఆగినట్లుగా అయిపోయింది. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే జోష్ హుషార్ త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లోనూ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఇక బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేయాలంటే కరీంనగర్ సీటు ఖాళీగా లేదు. అక్కడ బీజేపీ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు.

ఆయన్ని కాదని ఈటెలకు ఇచ్చేది లేదు. ఆయన్ని ఏ మెదక్ నుంచో పోటీ చేయమని అంటారు. అక్కడ గెలుపోటములు దోబూచులాట. పైగా కాంగ్రెస్ బలంగా ఉందని సంకేతాలు ఉన్న నేపధ్యంలో ఎదురీతగానే ఉంటుంది. అందుకే ఈటెల ఇపుడు షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు అని అంటున్నారు.

ఆయన కాంగ్రెస్ లో చేరిపోతారు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తారు అని అంటున్నారు. ఈటెల అయితే బీజేపీలో ఇమడలేకపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఈటెల మల్కాజ్ గిరి లోక్ సభ సీటుని బీజేపీ పెద్దలను అడుగుతున్నారుట. అక్కడ పోటీ చేసే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన భావన.

కానీ ఆ సీటు ఇచ్చేందుకు హై కమాండ్ సిద్ధంగా లేదు అని అంటున్నారు. దీంతో ఈటెల కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో ఆయన చేరేందుకు ఒక రౌండ్ డిస్కషన్స్ కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. ఈ విషయం మీద కరీం నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది.

ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. అయితే ఈటెల కాంగ్రెస్ లోకి పోకుండా అడ్డుకోవాలని బెజేపీలోనూ చర్చ ఎత్తున చర్చ సాగుతోంది.కానీ ఈటెల ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ బలంగా ఉంది. అయిదేళ్ల పాటు ఢోకా లేకుండా అధికారంలో ఉంటుంది. అదే సమయంలో బీజేపీ ఇంకా బలంగా వేళ్ళూనుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈటెల ఎంపీ ఎన్నికలను తన లక్ మార్చేవిగా మార్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన మల్కాజ్ గిరి టికెట్ ని కాంగ్రెస్ ఇస్తే తీసుకుని పోటీ చేయబోతారా అన్నది ఒక చర్చగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈటెల కనుక బీజేపీని వీడితే ఆ పార్టీకి అదే అతి పెద్ద షాక్ గా మారడం ఖాయమని అంటున్నారు.