Begin typing your search above and press return to search.

ఏపీపై ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు... ట్రై చేయమంటున్న నెటిజన్లు!

ఈమధ్యకాలంలో ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు చేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు కొంతమంది తెలంగాణ మంత్రులు

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:50 AM GMT
ఏపీపై ఎర్రబెల్లి వివాదాస్పద వ్యాఖ్యలు... ట్రై చేయమంటున్న నెటిజన్లు!
X

ఈమధ్యకాలంలో ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు చేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు కొంతమంది తెలంగాణ మంత్రులు. ఈ లిస్ట్ లో హరీష్ రావుతో సహా పలువురు ఉండగా... తాజాగా ఆ లిస్ట్ లో చేరాలనే ఉబలాటమో.. లేక, కేసీఆర్ తో వచ్చిందంటున్న గ్యాప్ ను ఫిల్ చేసుకునే ప్రయత్నమో తెలియదు కానీ... ఎర్రబెల్లి కూడా ఏపీపై కామెంట్లు చేశారు.

అవును... ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వంపైనా, ఆ ప్రభుత్వ పనితీరుపైనా తెలంగాణ మంత్రులు నోరుపారేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో ఉండి ఏపీలో ఏమి జరుగుతుందో పూర్తిగా తెలియని వారు సైతం... అక్కడ పరిస్థితిపై కామెంట్లు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఏపీ మంత్రులు రెండు వైపులా వాయించి వదులుతున్న సంగతి తెలిసిందే. దీంతో గత కొద్ది కాలంగా అలాంటి కామెంట్లు తగ్గాయి.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మైకందుకున్న ఆయన... తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడే క్రమంలో ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏపీలో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయిందన్నట్లుగా మాట్లాడారు.

ఇందులో భాగంగా... తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే ఏపీలో మాత్రం కరెంటు లేక తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇదే సమయంలో తెలంగాణలో భూముల ధరలు పెరిగితే, ఏపీలో ధరలు పడిపోయాయని తెలిపారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో ఎకరాల కొద్ది కొనుక్కోవచ్చని చెప్పుకొచ్చారు.

దీంతో ఎర్రబెల్లిని వాయించి వదులుతున్నారు నెటిజన్లు. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే అనే భ్రమను కల్పించి మాయ చేస్తున్నారని అంటున్నారు! ఇదే సమయంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి హైదరాబాద్ ని చూసి డ్రైనేజీ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు.

ఇదే సమయంలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి ఏపీకి వచ్చి కరెంటు తీగలపై కర్చీఫ్ ఆరేసుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ఫలితంగా ఏపీలో విద్యుత్ సరఫరా ఉందో లేదో సులువుగా తెలుసుకునే ఛాన్స్ ఉందని ఎద్దేవా చేస్తున్నారు.