Begin typing your search above and press return to search.

హైదరబాద్ లో ఈఎంఐ టెన్షన్స్... దేశంలో రెండో ప్లేస్!

ఈ క్రమంలో దేశంలోనే ఐటీ రంగంలో ఊహించని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అంటుంటారు

By:  Tupaki Desk   |   18 Aug 2023 11:30 AM GMT
హైదరబాద్ లో ఈఎంఐ టెన్షన్స్... దేశంలో రెండో ప్లేస్!
X

భాగ్యనగరం ప్రస్తుతం విశ్వనగరంగా వ్యాప్తి చెదుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీలు హైదరాబాద్ ని ఒక అడ్డాగా చేసుకుంటున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో దేశంలోనే ఐటీ రంగంలో ఊహించని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అంటుంటారు.

అన్ని రకాలుగానూ అనువైన ఈ హైదరబాద్ లో ఇప్పుడు సామాన్యులు ఆస్తులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. అవును... కోకాపేట్‌, బుద్వేల్‌ లోని భూములను అత్యంత అధిక ధరలకు వేలం వేయడంతో ఆయా ప్రాంతాల్లో సామాన్యులకు ఆస్తులు కొనలేని పరిస్థితి నెలకొంది.

తాజాగా ఎకరం వందల కోట్లలో హైదరబాద్ లోని ఆస్తులు వేలం వేయడంతో రియల్ ఎస్టేట్ ఖర్చులు కనీసం 20% పెరుగుతాయని అంచనా చేస్తున్నారు నిపుణులు. దీంతో ముఖ్యంగా మధ్యతరగతి, వేతన జీవులకు భరించడం సాధ్యం కాని సమస్యలు సృష్టించబడ్డాయని అంటున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన మార్కెట్‌ గా ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఆదాయంలో సుమారు 31% హౌస్ లోన్ ఈఎంఐ లకే ఖర్చయిపోతుందని అంటున్నారు.

ఈ క్రమంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. ఈఎంఐ లకు అధికం శాతం డబ్బులు చెల్లించే వ్యక్తులు ఉన్న నగరాల్లో వరుసగా ముంబై, హైదరాబాద్ , ఢిల్లీ ఉండటం గమనార్హం. అంటే... దేశరాజధాని కంటే పరిస్థితి భాగ్యనగరంలో ఎక్కువగా ఉందన్నమాట.

ఇదే సమయంలో ఎన్.సీ.ఆర్. రిపోర్ట్స్ ప్రకారం నైట్ ఫ్రాంక్ యొక్క అఫర్డబిలిటీ ఇండెక్స్ లో ముంబై అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్ కాగా.. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, ఢిల్లీలు ఉన్నాయి.

ఇదే సమయంలో హైదరాబాద్ కూడా అమ్ముడుపోని హౌసింగ్ ఇన్వెంటరీ సమస్యను కూడా ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఇప్పటికే అమ్ముడుపోని ఫ్లాట్ లు లక్షకు పైగానే ఉన్నాయని అంటున్నారు. థానే తర్వాత ఇదే దేశంలో అత్యధిక నెంబర్!

కాగా... హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం ద్వారా 7000 కోట్ల రూపాయలను ఆర్జించిన సంగతి తెలిసిందే. దీంతో సిటీలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.