బిల్ గేట్స్ కు ఘోర అవమానం?
టెక్నాలజీ ప్రపంచంలో 'గాడ్‌ఫాదర్' గా పిలవబడే బిల్ గేట్స్.. ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ పితామహుడిగా మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఆయన ఇమేజ్‌ను మార్చేస్తున్నాయి.
By: A.N.Kumar | 17 Feb 2026 12:39 PM ISTటెక్ దిగ్గజం బిల్ గేట్స్‌కు భారత్ నో చెప్పిందా? ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక AI సమ్మిట్‌కు ఆయన దూరం కావడం వెనుక ఎప్‌స్టీన్ వివాదాలే కారణమా? ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ పరిణామం.. గేట్స్ ఇమేజ్‌కు గట్టి దెబ్బేనా? అసలు ఈ 'ఘోర అవమానం' వెనుక ఉన్న కారణాలేంటన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
టెక్నాలజీ ప్రపంచంలో 'గాడ్‌ఫాదర్' గా పిలవబడే బిల్ గేట్స్.. ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ పితామహుడిగా మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఆయన ఇమేజ్‌ను మార్చేస్తున్నాయి. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌కు ఆయన దూరం కావడంతో బిల్ గేట్స్ కు ఘోర అవమానంగా మారింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయనకు వ్యక్తిగతంగా అవమానించడమే అవుతుందన్న చర్చ మొదలైంది..
ఎప్‌స్టీన్ వివాదం.. ఒక నైతిక సంక్షోభం
జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన పత్రాలు మళ్ళీ బయటకు రావడం బిల్ గేట్స్ ప్రతిష్టను దెబ్బతీసింది. గతంలోనే గేట్స్ తన విడాకుల సమయంలో ఈ విషయంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'మీ టూ' వంటి ఉద్యమాల తర్వాత, మహిళల భద్రత,నైతికత విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇలాంటి తరుణంలో గేట్స్ వంటి వ్యక్తులకు వేదికను కల్పించడం వల్ల ప్రభుత్వంపై లేదా నిర్వాహకులపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ 'ఇమేజ్ మేనేజ్‌మెంట్' వ్యూహం
భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఏఐ (కృత్రిమ మేధ) వంటి భవిష్యత్తు సాంకేతికతలపై చర్చించేటప్పుడు, ఆ వేదిక 'స్వచ్ఛంగా' ఉండాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. వివాదాల్లో ఉన్న వ్యక్తులను ఆహ్వానించడం ద్వారా అనవసరమైన నెగెటివ్ పబ్లిసిటీని కొనితెచ్చుకోవడం ఇష్టం లేకపోవచ్చు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పడం లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇది నిజంగా 'అవమానమేనా'?
దీనిని 'అవమానం' అనడం కంటే 'నైతిక దూరం' అనడం సబబుగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పెద్ద స్థాయి సదస్సులకు ఆహ్వానాలు పంపేముందు లేదా రద్దు చేసేముందు దౌత్యపరమైన చర్చలు జరుగుతాయి. ఒకవేళ భారత్ తన పర్యటనను సున్నితంగా తిరస్కరించి ఉంటే అది గేట్స్ కెరీర్‌లో ఒక పెద్ద మచ్చగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఆయన తన స్వచ్ఛంద సంస్థ ద్వారా భారత్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బిల్ గేట్స్ పర్యటన రద్దు అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది టెక్నాలజీ వర్సెస్ నైతికత మధ్య జరుగుతున్న ఘర్షణకు చిహ్నం. ఎంతటి మేధావి అయినా సామాజిక బాధ్యత .. వ్యక్తిగత ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ప్రపంచం వారిని నిలదీస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. ఇది ఆయనకు జరిగిన 'అవమానం' కంటే, ప్రపంచ నాయకులకు అందుతున్న ఒక 'హెచ్చరిక' అని చెప్పవచ్చు.
