Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా బ్యాడ్ న్యూస్ చెప్పినట్లేనా?

విదేశాళ్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు పలు దేశాలు వరుసగా షాకులిస్తున్నాయి

By:  Tupaki Desk   |   11 Dec 2023 10:23 AM GMT
భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా బ్యాడ్ న్యూస్ చెప్పినట్లేనా?
X

విదేశాళ్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు పలు దేశాలు వరుసగా షాకులిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బ్రిటన్ వీసా రూల్స్ ని కఠనతరం చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా కూడా అదే పద్దతిని ఫాలో అవుతుంది. ఈ క్రమంలో వీసా నిబంధనలను కఠినతరం చేయనుంది. దీంతో విదేశీ విద్యార్థులు, లో-స్కిల్డ్ వర్కర్స్ కి వీసాలు రావడం మరింత కష్టం కానుంది.

అవును... అంతర్జాతీయ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా కొత్త కఠినమైన వీసా నిబంధనలను అమలు చేస్తుంది. ఫలితంగా రాబోయే రెండేళ్లలో ఆదేశం వలసలను సగానికి తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ మేరకు ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నీల్ కొత్త రూల్స్ ని ఆవిష్కరించారు.

కొత్త పాలసీల ప్రకారం... ఆస్ట్రేలియాలో చదవాలనుకుంటున్న విదేశీ విద్యార్థులు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షలలో టాప్ స్కోర్‌ లను సాధించవలసి ఉంటుంది. ఇదే సమయంలో ఇప్పటికే అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల వీసా పొడిగింపు అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టించేలా చర్యలు తీసుకుంటుంది.. వీటిపై కూడా ఎక్కువ పరిశీలన ఉండనుంది. దీంతో ఈ నిర్ణయాలు వలసదారుల సంఖ్యను ఆశించిన స్థాయిలో తగ్గుదలకు దోహదపడుతుందని ఓ నీల్ చెప్పుకొచ్చారు.

2022-23లో నికర ఇమ్మిగ్రేషన్ రికార్డు స్థాయిలో 5,10,000కి చేరుకుందని అంచనా వేసిన అనంతరం ఆస్ట్రేలియా సర్కార్ ఈ నిర్ణయం తీసుకోంది. ఈ నిర్ణయం ద్వారా 2024-25, 2025-26లో దాదాపుగా కోవిడ్‌ కు ముందు ఉన్న స్థాయిలకు అనుగుణంగా వలసలు సుమారు పావు మిలియన్‌ కు పడిపోవచ్చని అధికారిక డేటా అంచనా వేసింది.

ఆస్ట్రేలియాలో విదేశీ కార్మికులు, విద్యార్థుల ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అది అద్దె ఇళ్లపై ఒత్తిడిని పెంచిందని.. ఇది దేశంలో నిరాశ్రయుల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే... ఆస్ట్రేలియన్ ప్రభుత్వం గృహాలు కొనుగోలు చేసే విదేశీయులకు రుసుములను గణనీయంగా పెంచే ప్రణాళికలను ప్రకటించింది.

ఈ క్రమంలో... విదేశీ యజమానులు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం తమ ఇంటిని ఖాళీగా ఉంచితే.. గతంలో విదేశీ పెట్టుబడి రుసుముతో సమానమైన వార్షిక వేకెన్సీ రుసుమును రెట్టింపు చేస్తారు. ఇప్పటికే ఖాళీగా ఉంచిన ఇళ్లకు వార్షిక రుసుము ఆరు రెట్లు పెరిగింది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నిర్వహించిన ఒక సర్వేలో 62% మంది ఆస్ట్రేలియన్ ఓటర్లు దేశంలో వలసలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. దీంతో వలసదారులపై ఆస్ట్రేలియా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్లేనని.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం... ఈ మేరకు వీసా నిబంధనలను కఠినతరం చేయాలని భావించింది!