Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులను సరైన విధంగా పనిచేసేలా మార్గనిర్దేశనం చేశారు

By:  Tupaki Desk   |   26 Dec 2023 7:36 AM GMT
రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులను సరైన విధంగా పనిచేసేలా మార్గనిర్దేశనం చేశారు. ఉద్యోగులను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఒక తీరు ఇప్పుడు మరో తీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచిస్తున్నారు. దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మార్కు చూపించాలని తాపత్రయపడుతున్నారు. పరిపాలనలో దూకుడుగా ఉండాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తప్పు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటూనే తప్పులు చేసే వారిపై కఠినంగా ఉంటామని సంకేతాలు ఇచ్చారు. తప్పు జరిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అంటున్నారు. తప్పులకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని తేల్చారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలని చెబుతున్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేరాలు, హత్యలు, దొంగతనాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అధికార యంత్రాంగం చేత పని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగులకు వార్నింగ్ ఇస్తూ వారిలోని ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఉద్యోగుల చేత పనిచేయించే క్రమంలో కఠినంగా ఉండటం తప్పనిసరని సీఎం గుర్తించారు. అందుకే వారితో సమర్థంగా పనిచేయించేందుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.