Begin typing your search above and press return to search.

నిశ్చితార్థం చేసుకొన్న ఎలాన్‌ మస్క్‌ మాజీ భార్య.. ట్విస్ట్ ఇదే!

అవును... బ్రిటిష్ స్టార్ నటుడు థామస్ బ్రాడీ సాంగ్ స్టర్ తో రెండేళ్లు డేటింగ్ చేసిన తలులా రిలే.. ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2023 3:42 AM GMT
నిశ్చితార్థం చేసుకొన్న ఎలాన్‌  మస్క్‌  మాజీ భార్య.. ట్విస్ట్  ఇదే!
X

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎలాన్‌ మస్క్‌ కు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. ఇక ఆయన మాజీ పర్సనల్ ఇష్యూస్ అయితే మరింత ఆసక్తిగా ప్రపంచం చూస్తుంటోంది. ఈ క్రమంలో మస్క్ మాజీ భార్య కు సంబంధించిన విషయం తెరపైకి వచ్చింది.

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ వైవాహిక జీవితంలో చాలా కుదుపులే వచ్చాయి. మస్క్ ఇప్పటివరకూ మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాటిలో ఏ ఒక్క పెళ్లి కూడా నిలవలేదు. మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు భార్యలతోనూ ఆయన అధికారికంగా విడిపోయారు. ఆయన నుంచి విడాకులు తీసుకున్న వారిలో రెండో భార్య తలులా రిలే!

మస్క్ అండ్ రిలే గతంలో రెండేళ్లు డేటింగ్ చేసుకున్న తరువాత స్కాట్లాండ్‌ లోని డోర్నోచ్ కేథడ్రల్‌ లో వివాహం చేసుకున్నారు. అనంతరం 2016లో విడాకులు తీసుకున్నారు. ఆమెను మస్క్ రెండు సార్లు పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఆమెకు ఇప్పుడు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.

అవును... బ్రిటిష్ స్టార్ నటుడు థామస్ బ్రాడీ సాంగ్ స్టర్ తో రెండేళ్లు డేటింగ్ చేసిన తలులా రిలే.. ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. థామస్ బ్రాడీతో తన ఎంగేజ్ మెంట్ అనంతరం తలులా రిలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దానికి మస్క్ తనదైన శైలిలో స్పందించారు.

"చాలా సంతోషంగా ఉంది.. రెండేళ్ల డేటింగ్ తర్వాత థామస్ బ్రాడీ కి నాకు ఎంగేజ్ మెంట్ అయ్యింది" అని ఆమె ట్విట్టర్ లో స్పందించారు. అతడితో ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. ఈ ట్వీట్ కు ట్విట్టర్ యజమాన్ని ఎలాన్ మస్క్ స్పందించారు. కంగ్రాట్యులేషన్స్ అంటూ లవ్ సింబల్ పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా రియల్ హీరోని కాదని రీల్ హీరోని పెళ్లి చేసుకుంటున్నవా అని మస్క్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది. బిజినెస్ లో సక్సెస్ అయినంత ఈజీ కాదు బ్రో మ్యారేజ్ లైఫ్ లో నెగ్గుకురావడం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారంట.