ఎలన్ మస్క్ ది అంతా మోసం?
ప్రపంచంలోనే కుబేరుడిగా ఊరికే కాలేదు. ఆయన బిజినెస్ తెలివితేటలు అన్ని ఉన్నాయి కాబట్టే ఆ అగ్రస్థానంలో కూర్చున్నారు.
By: Tupaki Desk | 29 March 2025 3:19 PM ISTప్రపంచంలోనే కుబేరుడిగా ఊరికే కాలేదు. ఆయన బిజినెస్ తెలివితేటలు అన్ని ఉన్నాయి కాబట్టే ఆ అగ్రస్థానంలో కూర్చున్నారు. ఇప్పటికీ కూడా అప్రతిహతంగా సాగుతున్నాడు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇది మనకు అర్థమవుతుంది. వ్యాపారం నుంచి రాజకీయం వరకూ ఆయన వాడని వ్యక్తులు లేరు.. ఉపయోగించుకోని మనిషి లేరంటాడు. సరైన విధంగా అడుగులు వేస్తూ అన్ని వ్యవస్థలు సరిగ్గా వాడుకుంటూ.. లూప్ హోల్స్ ను ఆయుధంగా మారుస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఎలన్ మస్క్ తెలివితేటలపై కథలు కథలుగా చెబుతారు.
తాజాగా తను ఎంతో ముచ్చటపడి కొన్న ఎక్స్ సంస్థ ( ట్విట్టర్)ను అమ్మేశాడు. అదేంటి అన్ని బిలియన్లు పోసి కొని.. అందరూ పోస్టులను ఊడగొట్టించి.. భారీగా ఫీజులు పెట్టి మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మస్క్ తన ఫేవరెట్ సోషల్ మీడియాను అమ్మడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. మస్క్ ట్విట్టర్ ఎక్స్ ను అమ్మారని తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మస్క్ మావ ఏకంగా టాక్సులు మాఫీ చేసుకోవడానికి పెద్ద స్కెచ్ వేశాడని తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. టాక్స్ లు ఎగ్గొట్టడానికి అమ్మకం,.. కొనడం అనే ట్రిక్ చేసి మోసం చేశాడని ఇప్పుడు వ్యాపారవర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగూ తను సపోర్టు చేసి గెలిపించిన డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అందుకే తెలివిగా ఈ వ్యాపార తెలివితేటలు వాడి టాక్సులు ఎగ్గొట్టే కొత్త ఎత్తుగడను మస్క్ మావ అమలు చేశారని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
తన చేతిలో ఉన్న అతిపెద్ద సోషల్ మీడియా ఎక్స్ ను తాజాగా అమ్మేసినట్లుగా ప్రకటించాడు. నిజమా? అన్న ఆశ్చర్యానికి గురై.. తేరుకునే లోపు అసలు ట్విస్టును రివీల్ చేసి.. అతగాడి తెలివికి ఫిదా అయ్యేలా చేశాడు. ఎందుకంటే.. ఎక్స్ ను అమ్మింది బయటవారికి కాదు. తనకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీకి అమ్మేశాడు. ఈ మేరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎక్స్ లో వెల్లడించాడు.33 బిలియన్ డాలర్లకు ఎక్స్ ను అమ్మివేసినట్లుగా ప్రకటించిన మస్క్.. దాన్ని కొనుగోలు చేసిన స్టార్టప్ సంస్థ విలువను తాజాగా రూ.80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్ ను తనకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఎక్స్ ఏఐ’ కు అమ్మినట్లుగా ప్రకటించారు. అధునాత ఏఐ సామర్థ్యాన్ని ఎక్స్ కు అనుసంధానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాల్ని రాబట్టవచ్చని తన తాజా పోస్టులో వెల్లడించారు.
చాట్ జీపీటీకి పోటీగా గత ఏడాది ఎక్స్ ఏఐ సంస్థను మస్క్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎక్స్ ఏఐ.. ఎక్స్ భవిష్యత్ లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లుగా చెప్పిన మస్క్.. డేటా మోడల్స్ ను అనుసంధానం చేయటం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాల్ని రాబట్టేందుకు ముందడుగు వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రెండు సంస్థలు ఒకటి కావటం ద్వారా కోట్లాది మంది ప్రజలకు అదిరే అనుభూతి అందుతుందని మస్క్ వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ంప్ నకు సలహాదారుగా వ్యవహరిస్తున్న మస్క్.. టెస్లా.. స్పేస్ ఎక్స్ సీఈవోగా కీలక బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చివరగా.. 2022లో ఇప్పటి ఎక్స్ అప్పటి ట్విటర్ ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్.. రెండేళ్లు తిరిగేసరికి దానిని 33 బిలియన్ డాలర్లకు అమ్మేయటం ఒక ఎత్తు అయితే.. సదరు సంస్థను తన స్టార్టప్ కు అమ్మేయటం ద్వారా దాని విలువను ఏకంగా 80 బిలియన డాలర్ల సంస్థగా మార్చటమే మస్క్ ముదురు తెలివికి నిదర్శనంగా చెప్పొచ్చు
దీనివెనుక టాక్స్ లు ఎగ్గొట్టే అతిపెద్ద గేమ్ ను ఎలన్ మస్క్ ఆడాడని వ్యాపారవర్గాలు అంటున్నాయి.. ఒక కంపెనీ వాల్యూ పెరిగితే ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్సులు పెరుగుతాయి. దాన్ని తక్కువకు అమ్మితే కట్టాల్సిన టాక్సులు తగ్గిపోతాయి. సరిగ్గా ఇదే ట్రిక్ ను ఫాలో అయిన ఎలన్ మస్క్ కొత్త స్టార్టప్ కంపెనీకి ఈ అతిపెద్ద ఎక్స్ ను అమ్మేసి టాక్సులు ఎగ్గొట్టాడని వ్యాపారవర్గాలు అంటున్నాయి. మస్క్ మావ తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఊరికే ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు కాలేదు మస్క్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.
