రూ.కోటి కోట్లకు చేరువలో ప్రపంచ కుబేరుడు
మరి.. అలాంటి ఆయనకు రూ.కోటి కోట్ల ఆస్తికి యజమాని అని ఎలా చెబుతున్నారు అన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.
By: Garuda Media | 8 Jun 2026 10:12 AM ISTకొన్నేళ్ల క్రితం రూ.లక్ష కోట్ల ఆస్తిపరుడన్న మాట విన్నంతనే.. విస్మయానికి గురయ్యే పరిస్థితి. చూస్తుంటే.. ఆ భారీ అంకె చాలా పాతదిగా మారింది. అందుకు భిన్నంగా ఆధునిక మానవ చరిత్ర ఆరంభం నుంచి ఇప్పటివరకు.. ప్రపంచానికి తెలియని కొత్త అంశానికి చేరువలోకి వచ్చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అవును.. రూ.కోటి కోట్ల ఆస్తికి దగ్గరకు వచ్చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు కొత్త హిస్టరీకి తెర తీశారు. ఆధునిక చరిత్రలో ఎవరూ ఈ అరుదైన రికార్డుకు చేరువ అయ్యింది లేదు. దీంతో.. ప్రపంచంలోనే తిరుగులేని కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మన రూపాయిల్లో ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ దగ్గర దగ్గర రూ.75 లక్షల కోట్లకు పైనే ఉంటాయని లెక్కిస్తున్నారు.
మరి.. అలాంటి ఆయనకు రూ.కోటి కోట్ల ఆస్తికి యజమాని అని ఎలా చెబుతున్నారు అన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. ఆయనకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ జూన్ 12న ఐపీవోకు రాబోతోంది. అంటే.. షేర్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతుందన్న మాట. ఈ సంస్థలో మస్క్ వాటా అక్షరాల 50శాతానికి పైనే. అంతే.. దీనిపై వచ్చే ఆదాయంతో ఆయన ఆస్తుల విలువ ఎక్కడికో వెళ్లిపోయే పరిస్థితి. ఐపీవోకు వచ్చిన తర్వాత.. షేరు ధర ఆధారంగా ఆయన ఆస్తుల విలువ భారీగా వ్రద్ధి చెందటం ఖాయం.
ఐపీవోకు వచ్చిన తర్వాత ఆయన ఆస్తుల విలువ 1.11 ట్రిలియన్ డాలర్లు అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ ట్యాగ్ ఎలాన్ మస్క్ కు దక్కనుంది. ఈ భారీ మొత్తాన్ని మన రూపాయిల్లో లెక్కేస్తే.. రూ.కోటి కోట్లకు పైనే ఉంటుంది. అపర కుబేరుల జాబితాలో ఉన్న పలువురి కుబేరుల ఆస్తులు కలిపితే కానీ ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటుతుంది. అలాంటిది మస్క్ ఒక్కడి ఆస్తే అంత ఉండటం చూస్తే.. ఆయన సాధించిన ఘనత ఎంత కీలకమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆయన ఆస్తి ప్రపంచంలోని పలు ప్రముఖ దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
