ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: ఎలన్ మస్క్‌ను అమెరికా నుంచి పంపించేస్తారా?
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది.
By: Tupaki Desk | 2 July 2025 10:15 AM ISTటెస్లా సీఈఓ ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మస్క్‌కు ప్రభుత్వం నుంచి లభిస్తున్న సబ్సిడీలపై ట్రంప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా... ఆయన స్వదేశం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
-ట్రంప్ వ్యాఖ్యల సారాంశం
"మస్క్‌కు లభించే సబ్సిడీలు లేకపోతే అతను టెస్లాను మూసేసి తన స్వదేశం దక్షిణాఫ్రికాకు తిరిగిపోవాల్సి వస్తుంది. అప్పుడే అమెరికాకు వందల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. ఇకపై రాకెట్ లాంచ్‌లు, శాటిలైట్‌లు, ఎలక్ట్రిక్ కార్లు ఉండవు" అని ట్రంప్ అన్నారు. అంతేకాదు ఒక విలేఖరి "ఎలన్ మస్క్‌ను మీరు దేశం నుంచి పంపించివేస్తారా?" అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. "చూద్దాం. మేము DOGEని ఎలన్ మీద వదిలించవచ్చు. DOGE అంటే ఏంటో తెలుసా? అదే అతన్ని తినేయగలదేమో!" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో మరిన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
- ఎలన్ మస్క్ స్పందన
ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఎలన్ మస్క్ నుండి ఇప్పటివరకు ప్రత్యక్ష స్పందన రాలేదు. అయితే ట్రంప్ తీసుకొచ్చిన పన్ను, ఖర్చుల బిల్లుపై గతంలో మస్క్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తుత దూషణలకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
- ప్రభుత్వ సబ్సిడీలు.. మస్క్ కంపెనీలు
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు గతంలో ప్రభుత్వ సబ్సిడీలు లభించిన మాట వాస్తవమే. అయితే ఈ సబ్సిడీలను తీసేసినప్పుడు మస్క్ వ్యాపార సామర్థ్యం తగ్గిపోతుందని ట్రంప్ వాదిస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఎలన్ మస్క్ పౌరసత్వాన్ని, దేశానికి ఆయన అందించే సేవలను ప్రశ్నించేలా ఉన్నాయి. నిజంగా మస్క్‌పై చర్యలు తీసుకుంటారా? లేక ఇది రాజకీయ విమర్శ మాత్రమేనా? అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ట్రంప్-మస్క్ మధ్య "కోల్డ్ వార్" ఉద్రిక్తత నెలకొంది.
