Begin typing your search above and press return to search.

బాబుకు ఈసీ నోటీసులు.. వివాదాస్పద పోస్టు వెంటనే డిలీట్‌!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 March 2024 3:45 AM GMT
బాబుకు ఈసీ నోటీసులు.. వివాదాస్పద పోస్టు వెంటనే డిలీట్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చాలావరకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా కొన్ని సీట్లకే ప్రతిపక్ష కూటమి సీట్లను ప్రకటించాల్సి ఉంది.

దాదాపు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. మరోవైపు సోషల్‌ మీడియాలో ఆకాశమే హద్దు అన్నట్టు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. భారీ ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని అభ్యంతరకర పోస్టులు కూడా పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. ఈ పోస్టుపై వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు రాష్ట్ర ఎన్నికల సం«ఘం ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ పై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఇచ్చారు. ఎక్స్, ఫేస్‌ బుక్, ఇనస్ట్రాగామ్, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో జగన్‌ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని, అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీటిని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌.. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ను కించపరిచేలా టీడీపీ సోషల్‌ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులను 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ సోషల్‌ మీడియా పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉ­న్నా­యని సీఈవో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎక్స్‌ లో టీడీపీపై మండిపడింది. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే పోస్టు డిలీట్‌ అవ్వడం కాదని.. ఏకంగా టీడీపీయే డిలీట్‌ అవుతుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు చంద్రబాబుకు ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులను, టీడీపీ పెట్టిన పోస్టును జత చేసింది.

''టీడీపీకి మొట్టికాయలు వేసిన ఎలక్షన్ కమీషన్! సీఎం @య్సజగన్ గారిని అవమానించేలా @జైటీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్ట్‌ని డిలీట్ చేసిన టీడీపీ ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్ట్‌లు కాదు టీడీపీ పార్టీనే డిలీట్ చేయాల్సి వస్తుంది @నసీబున్ గుర్తుంచుకో!" అంటూ వైసీపీ మండిపడింది.